Tuesday, 03 December 2024 05:21:33 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

రూ.100 కోట్లు ఇవ్వొద్దని అదానీకి లేఖ రాశాం.. ఇక తెలంగాణను వివాదాల్లోకి లాగకండి: సీఎం రేవంత్ రెడ్డి

విమర్శల దృష్ట్యా రూ.100 కోట్ల విరాళం తిరస్కరిస్తున్నామన్న సీఎం ఏ సంస్థకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్న సీఎం స్పీకర్ కుమార్తె పెళ్ల

Date : 25 November 2024 04:05 PM Views : 54

Studio18 News - తెలంగాణ / : స్కిల్ యూనివర్సిటీకి ఇస్తామన్న రూ.100 కోట్లు ప్రభుత్వ ఖాతాలో వేయకండని తాము అదానీకి లేఖ రాశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అమెరికాలో కేసు తదితర పరిణామాల నేపథ్యంలో అదానీ నుంచి రూ.100 కోట్లు స్వీకరించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అనవసర వివాదాల్లోకి తెలంగాణను లాగవద్దని విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. విమర్శల దృష్ట్యా ఈ విరాళం తిరస్కరించినట్లు వెల్లడించారు. అదానీ విషయమై కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చ సాగుతోందన్నారు. అమెరికాలో కేసు నమోదు కావడంతో ఈ చర్చ సాగుతోందన్నారు. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం కూడా నిధులు సేకరించిందని ప్రచారం చేస్తున్నారని, కానీ ప్రభుత్వ ఖాతాలోకి ఎవరి నుంచి డబ్బులు రాలేదన్నారు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు వస్తున్నట్లు చెప్పారు. నిబంధనల మేరకు తమ ప్రభుత్వం టెండర్లను పిలిచి ప్రాజెక్టులు ఇస్తోందని వెల్లడించారు. దేశంలోని ఏ సంస్థకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్నారు. అంబానీ, అదానీ, టాటా.. ఇలా ఎవరికైనా తెలంగాణలోనూ వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుందన్నారు. సీఎస్ఆర్ కింద మాత్రమే అదానీ గ్రూప్ స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు ఇచ్చిందని స్పష్టం చేశారు. కానీ ఈ రూ.100 కోట్లను సీఎం, మంత్రులకు ఇచ్చినట్లుగా ప్రచారం చేయడం విడ్డూరమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అదానీ ఇస్తామన్న రూ.100 కోట్లను స్వీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు లేఖ రాసినట్లు చెప్పారు. స్పీకర్ కుమార్తె పెళ్లి కోసం ఢిల్లీకి వచ్చానన్న సీఎం లోక్ సభ స్పీకర్ కుమార్తె వివాహం కోసం తాను ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుత తన ఢిల్లీ పర్యటనకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. పార్లమెంట్ సమావేశాలపై రేపు ఎంపీలతో చర్చిస్తామన్నారు. అందుబాటులో ఉన్న మంత్రులతో కలిసి రేపు రాష్ట్ర సమస్యలను కేంద్రానికి వివరిస్తామన్నారు. కొంతమంది తాను 28సార్లు ఢిల్లీకి వచ్చినట్లు చెబుతున్నారని, కానీ వారిలో పైరవీలు చేయడానికో... బెయిల్ కోసమో తాను ఢిల్లీకి రావడం లేదన్నారు. కేంద్రాన్ని కలిసి మనకు రావాల్సినవి రాబట్టుకోవడం కోసం వస్తున్నామన్నారు. అవసరమనుకుంటే ఢిల్లీకి ఎన్నిసార్లైనా వస్తానన్నారు.

Also Read : డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌కు నివేదిక అందించిన కవిత

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :