Studio18 News - తెలంగాణ / : కులగణనతో దేశానికి ముప్పు అని ఆర్ఎస్ఎస్ అంటోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కులగణన చేస్తే దేశం మునిగిపోతుందా అని నిలదీశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ దేవుళ్ల పేరు మీద రాజకీయాలు చేస్తున్నాయని వీహెచ్ విమర్శించారు. బీజేపీ నిజ స్వరూపం బయట పడిందని, దీనికి కేంద్ర సహా మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలపై బీసీ, ఎస్సీలు కలిసి యుద్ధం చేయాలని అన్నారు. కులగణన చేస్తే 90 శాతం మందికి న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. 1930న దేశంలో కులగణన జరిగిందని, ఆ తర్వాత జరగలేదని చెప్పారు. 18 ఏళ్లకే ఓటుహక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదని వీహెచ్ అన్నారు.
Admin
Studio18 News