Studio18 News - తెలంగాణ / : ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందా? అని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. భూములలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం కోరాలని సూచించారు. ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అభిప్రాయ సేకరణ చేసినట్లు చెప్పారు. ధరణిపై విచారణ ఎందుకు జరగడం లేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎన్నో హామీలను ఇచ్చిందని, వాటిని అమలు చేయకుంటే ప్రజలు క్షమించరని హెచ్చరించారు.
Admin
Studio18 News