Studio18 News - తెలంగాణ / : Hyderabad CP Kota Kota Srinivasa Reddy : హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. బోయినపల్లిలో రూ.8.5 కోట్ల విలువ చేసే ఎనిమిదిన్నర కిలోల మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో పెద్ద మొత్తంలో తరలిస్తున్న ఎంఫిటమిన్ డ్రగ్స్ ను పట్టుకున్నాం. ఈ డ్రగ్స్ ను ఇంజక్షన్లు, లిక్విడ్ గాను.. వివిధ రూపాల్లో తీసుకుంటున్నారు. ఈ డ్రగ్ ను అమ్మాయిలకు కూల్ డ్రింక్స్ లో కలిపి ఇస్తున్నారని సీపీ అన్నారు. 8.5 కేజీల ఎంఫిటమిన్ డ్రగ్ ముడి సరుకును సీజ్ చేయడం చేయడం జరిగింది. ఈ డ్రగ్స్ రవాణాలో ప్రధాన నిందితుడు సంగారెడ్డి కంచెర్ల నాగరాజు అని సీపీ తెలిపారు. కుంతి శ్రీ శైలం, వినోద్ కుమార్ లతో కలిసి నాగరాజు ఈ డ్రగ్స్ రవాణా చేస్తున్నాడు. గతంలో గుమ్మిడిదలలో ఆల్ఫాజోలంను తయారు చేస్తున్న అంజిరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని కంపెనీ సీజ్ చేశాం. అరెస్ట్ అయిన పాత నేరస్తుడు అంజిరెడ్డి శిష్యుడు కంచెర్ల నాగరాజు. అంజిరెడ్డి అరెస్ట్ కు ముందు డ్రగ్ ముడి సరుకును నాగరాజు దగ్గర పెట్టి వ్యాపారానికి ప్లాన్ చేశాడని సీపీ తెలిపారు. మార్కెట్లో ఈ డ్రగ్ ఖరీదు ఒక కేజీ రూ. కోటి నుంచి కోటిన్నర వరకు ఉంటుంది. ఈ ఎంఫిటమిన్ డ్రగ్స్ సమాచారం పై హెచ్ న్యూ దృష్టి సారించింది. బోయినపల్లి పల్లిలో స్థానిక పోలీసులు, హెచ్ న్యూ టీమ్స్ 8.5 కేజీల ఎంఫిటమిన్ డ్రగ్ పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులను పట్టుకుని అరెస్ట్ చేశాం. పరారీ లో ఉన్న ఇతర వ్యక్తులను పట్టుకునేందుకు టీమ్స్ గాలిస్తున్నాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ 8.5 కేజీల డ్రగ్స్ ఖరీదు మొత్తం రూ.8.5 కోట్ల విలువ ఉంటుందని తెలిపారు. సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి యువతకు కీలక సూచన చేశారు.. దయచేసి నగర యువత డ్రగ్స్ బారిన పడకండి. పార్టీలకు వెళ్లే యువత.. తెలిసిన, తెలియని వ్యక్తులతో వెళ్ళినపుడు అప్రమత్తంగా ఉండాలి. మాదక ద్రవ్యాలను కూల్ డ్రింక్స్ లో కలిపి ఇస్తుంటారు. కాబట్టి అలెర్ట్ గా ఉండాలి. తల్లి దండ్రులుసైతం తమ పిల్లలు ఎవరితో పార్టీలకు పోతున్నారో గమనిస్తూ ఉండాలని సీపీ సూచించారు. డ్రగ్స్ ను వాడడంతో పాటు పక్కవారికి అలవాటు చేసిన వారిపైకూడా కేసులు పెడుతాం. ఇక నుండి కన్జ్యుమర్లు పై ఉక్కుపాదం మోపుతామని సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Admin
Studio18 News