Studio18 News - TELANGANA / JAGTIAL : విద్యార్థులు మాదక ద్రవ్యా లకు దూరంగా ఉండాలని జగిత్యాల బల్దియా చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్ లో నేతాజీ ఒకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ హాజరై నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా మంచి మార్కులు సాధించాలన్నారు. విద్యార్థులకు మంచి పునాది ఇవ్వడంలో ఉపాధ్యాయ బృందం కృషి ఎనలేనిదని, విద్యార్థులు గొప్పఎత్తులకు ఎదిగి ఉపాధ్యాయుల పేరుని నిలబెట్టాలని సూచించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, విద్యార్థులు బాధ్యతతో వ్యవహరిస్తూ చదువుపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు, ఆట పాటలు అలరించాయి. అనంతరం వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు.
Also Read : జననమే తప్ప మరణం లేని మహా నేత నేతాజీ
Admin
Studio18 News