Studio18 News - TELANGANA / : ఇటీవలి కాలంలో ప్రముఖుల ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలు హ్యాక్ కావడం ఎక్కువవుతోంది. ఇప్పటికే ఎందరో ప్రముఖులు హ్యాకర్ల బారిన పడ్డారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎక్స్ ఖాతాను కొందరు హ్యాక్ చేశారు. హ్యాకింగ్ జరిగిన సమయంలో ఆ ఖాతాలో కొన్ని వీడియోలను, పోస్టులను హ్యాకర్లు పెట్టారు. ఈ విషయాన్ని గడ్డం ప్రసాద్ తెలిపారు. "సూచన... ఈ రోజు ఉదయం నా వ్యక్తిగత ఎక్స్ ఖాతా కొంత సమయం హ్యాక్ అయింది. మా టెక్నికల్ టీమ్ ఈ విషయాన్ని గమనించి వెంటనే చర్యలు తీసుకుని సెట్ చేశారు. నా ఎక్స్ ఖాతా హ్యాకింగ్ అయిన సమయంలో నా అకౌంట్ లో వచ్చిన వీడియోలు, పోస్ట్ లకు, నాకు సంబంధం లేదని తెలియజేస్తున్నాను" అని స్పీకర్ ట్వీట్ చేశారు.
Admin
Studio18 News