Saturday, 14 December 2024 07:40:05 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

KTR: కాళ్లు మొక్కి కండువాలు కప్పింది ఎవరు?: శ్రీధర్ బాబుపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

Date : 24 September 2024 04:50 PM Views : 37

Studio18 News - తెలంగాణ / : తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన పదిమంది ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి కాళ్లు మొక్కి కండువాలు కప్పింది ఎవరు? అలా చేసిన సన్నాసి వెధవ ఎవరు? అని తీవ్రవ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ... త్వరలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుందని జోస్యం చెప్పారు. చెరువులన్నీ నిండితే కప్పలన్నీ వస్తాయని సామెత ఉందని, మనం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామని, అందుకే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అధికార పార్టీలోకి జంప్ చేశారని విమర్శించారు. కానీ ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన 150 మందితో సమావేశం పెడదామనుకుంటే వెయ్యి మందికి పైగా వచ్చారన్నారు. ఇది శేరిలింగంపల్లి పోరాటస్ఫూర్తిని తెలియజేస్తోందన్నారు. శేరిలింగంపల్లికి ఉపఎన్నిక వస్తే ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. అరికెపూడి గాంధీకి పార్టీ ఏం అన్యాయం చేసిందని ఫిరాయించాడో చెప్పాలన్నారు. అరికెపూడి గాంధీ ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినట్లుగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ అతి తెలివి ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ వ్యక్తి కాదు... బీఆర్ఎస్‌కు చెందిన వ్యక్తినే అని శ్రీధర్ బాబు అంటున్నారని, అదే నిజమైతే అరికెపూడికి కండువా కప్పిన సన్నాసి వెధవ ఎవరు? అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, కే కేశవరావు వంటి నేతల ఇళ్లకు వెళ్లి కాళ్లు మొక్కి మరీ వారికి కండువాలు కప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :