Studio18 News - తెలంగాణ / : హైదరాబాద్‌లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పెద్ద అంబర్‌పేట ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు 170 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారనే సమాచారంతో దాడులు చేసి గంజాయిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ ఖురేషి తెలిపారు. కొన్ని రోజులుగా నిందితుల కదలికలను గమనిస్తున్నామని, పక్కా సమాచారంతో 170 కిలోల గంజాయిని సీజ్ చేశామని వెల్లడించారు. ఈ ముఠాలో ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితులు అందరూ మహారాష్ట్రలోని ఒకే గ్రామానికి చెందిన వారని వెల్లడించారు. గంజాయి సరఫరా చేయడానికి వాహనాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. గంజాయిని తరలించే వాహనానికి మరో వాహనం ఎస్కార్ట్‌గా ఉన్నట్లు తెలిపారు. ఈ గంజాయిని మల్కాన్‌గిరి ప్రాంతంలో ప్యాక్ చేశారని, మహారాష్ట్రకు తరలిస్తున్నారని తెలిపారు. గంజాయిని తరలిస్తున్న ముఠాలో ఇస్మాయిల్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. సీజ్ చేసిన గంజాయి విలువ రూ.34 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. నిందితుల చరిత్రను బట్టి పీడీ యాక్ట్ పెడతామన్నారు.
Admin
Studio18 News