Sunday, 29 March 2026 05:21:36 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

KCR: కేసీఆర్ కు సిట్ నోటీసులపై మహేశ్ గౌడ్ స్పందన.. బాధ్యులకు శిక్ష పడాల్సిందేనని వ్యాఖ్య

Date : 29 January 2026 07:46 PM Views : 112

Studio18 News - TELANGANA / HYDERABAD : కేసీఆర్ పై తమకు గౌరవం ఉందన్న మహేశ్ గౌడ్ విచారణ పారదర్శకంగా జరుగుతోందని వ్యాఖ్య పూర్తి స్థాయిలో విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న మహేశ్ తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నంది నగర్ లోని ఆయన నివాసంలో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ వయసును దృష్టిలో ఉంచుకొని ఆయన కోరిన ప్రదేశంలోనే విచారిస్తామని సిట్ అధికారులు తమ నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు, కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ వ్యవహారంలో పారదర్శకంగా సిట్ విచారణ జరుగుతోందని ఆయన అన్నారు. కేసీఆర్ పై తమకు ఎంతో గౌరవం ఉందని... అయితే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరి భాగస్వామ్యం ఉందో నిగ్గుతేలాల్సి ఉందని చెప్పారు. అప్పటి సీఎం, మంత్రుల ఆదేశాలు లేకుండా ఇంతటి భారీ స్థాయి ఉల్లంఘనలు జరిగే అవకాశమే లేదని ఆయన అన్నారు. పూర్తి స్థాయిలో సిట్ దర్యాప్తు జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఎవరికైనా నోటీసులు ఇచ్చే అధికారం సిట్ కు ఉందని... కేసీఆర్‌కు నోటీసుల విషయంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని చెప్పారు. బాధ్యులు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :