Sunday, 29 March 2026 03:18:11 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

భద్రాచలంలో వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం—భక్తుల సందడి

Date : 28 March 2026 10:23 PM Views : 8

Studio18 News - TELANGANA / BHADRADRI KOTHAGUDEM : భద్రాద్రిలో కనులపండువగా ‘రామ పట్టాభిషేకం’ నిర్వహించగా, పట్టాభిషేక వైభవం మధ్య రామయ్యకు కిరీట ధారణ ఘనంగా జరిగింది. మిథిలా ప్రాంగణంలో రాజలాంఛనాల సమర్పణ వైభవంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించిన గవర్నర్ శివప్రతాప్ శుక్ల ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన ఉత్పత్తుల విక్రయశాల ‘గిరి మార్ట్’ను ఘనంగా ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మార్చి 28: దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం శనివారం కనులపండువగా జరిగింది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ వేడుకను తిలకించేందుకు దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలిరావడంతో మిథిలా ప్రాంగణం రామనామ స్మరణతో మార్మోగింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజలాంఛనాలతో ఊరేగింపుగా స్వామివారిని తీసుకువచ్చి, వేదమంత్రోచ్ఛారణల మధ్య పట్టాభిషేక వేడుకలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భద్రుని మండపంలో పాదుకల అభిషేకం అనంతరం గౌతమీ నదీ తీరం నుంచి తెచ్చిన పవిత్ర తీర్థాలతో కార్యక్రమం కొనసాగింది. కల్యాణ మండపంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం తర్వాత స్వామివారికి పాదుకలు, రాజదండం, రాజముద్రిక, స్వర్ణ కిరీటం, ఖడ్గం, రత్నాభరణాలు సమర్పించారు. చతుర్వేద పారాయణాలు, విష్ణుపురాణం, భాగవత పఠనాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మహాకుంభ తీర్థప్రోక్షణ అనంతరం భక్తులపై పవిత్ర జలాలు చల్లి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం ప్రార్థించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.350 కోట్లతో ఆలయ అభివృద్ధికి భూమిపూజ చేశామని, భద్రాచలాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బలరామ్ నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్, ఐటీడీఏ పీఓ రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘గిరి మార్ట్’ విక్రయశాలను గవర్నర్ ప్రారంభించగా, గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. అటవీ ఉత్పత్తులు, సేంద్రీయ ఆహార పదార్థాలు, హస్తకళా ఉత్పత్తులను గవర్నర్ ఆసక్తిగా పరిశీలించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :