Studio18 News - TELANGANA / NIZAMABAD : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోని శ్రీ వినాయక కిరాణా షాపులో నిజామాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీలలో గుడుంబా తయారీకి వినియోగించే 90 కిలోల బెల్లం, 70 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నామని టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ విలాస్ తెలిపారు. దుబ్బాకకు చెందిన అశోక్ కుమార్ కుమారుడు గోసికొండ ప్రశాంత్‌ను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసి అనంతరం ధర్పల్లి ఎంఆర్‌ఓ ఎదుట బైండోవర్ చేసినట్లు వెల్లడించారు.
Admin
Studio18 News