Sunday, 29 March 2026 05:23:37 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

Date : 06 December 2025 06:35 PM Views : 309

Studio18 News - TELANGANA / HYDERABAD : ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నను పోలీసులు హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర చారీ అంత్యక్రియలకు వెళ్లకుండా పోలీసులు మల్లన్నను అడ్డుకున్నారు. ఫిర్జాదిగూడ చెన్నరెడ్డి ఎంక్లవ్‌లో మల్లన్న ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై మల్లన్న ఆగ్రహం​ వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మల్లన్న సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఇదిలా ఉండగా.. రెండు రోజులు క్రితం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు సాయి ఈశ్వర్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ సాయి ఈశ్వర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్వేసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం, చికిత్స పొందుతూ సాయి ఈశ్వర్ శుక్రవారం తుది శ్వాస విడిచాడు. నేడు సాయి అంత్యక్రియలు జరగనున్నాయి. ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్‌కి న్యాయం చేయాలంటూ బీసీ సంఘాలు గాంధీ ఆసుపత్రి వద్ద శుక్రవారం ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్‌తో పాటు బీసీ సంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్ద చేరుకొని ఆందోళన చేపట్టారు. రంగంలోకి దిగి నిరసనకారులను చెదరగొట్టిన పోలీసులు.. తీన్మార్ మల్లన్నతో పాటు శ్రీనివాస్ గౌడ్‌, తదితరులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :