Studio18 News - తెలంగాణ / : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులకు సయోధ్య ఉన్నట్లుగా కనిపించడం లేదని, కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేని అసమర్థుడు ఈ సీఎం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... కేవలం డబ్బు కోసమే మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ఈ ప్రభుత్వం చేపట్టిందని ఆరోపించారు. బుల్డోజర్ ప్రభుత్వంతో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతుంటే రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు? అని ప్రశ్నించారు. హైడ్రాను నడిపిస్తోంది రేవంత్ రెడ్డి కాదని, రాహుల్ గాంధీ దీని వెనుక ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వెనుక ఉండి పేదల పైకి బుల్డోజర్ పంపిస్తున్నారని మండిపడ్డారు. నోట్ల కట్టల కోసం చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజల కష్టాలు పట్టవా? అని నిలదీశారు. ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదని, లూటిఫికేషన్ అని చురక అంటించారు. మూసీ ప్రాజెక్టుపై కనీసం ప్రాజెక్టు రిపోర్టు కూడా లేదన్నారు. సుందరీకరణ కోసం డబ్బు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలన్నారు. ఈ అంశంపై రెండు మూడు రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్నారు.
Admin
Studio18 News