Studio18 News - TELANGANA / ADILABAD : రాజీ మార్గమే రాజమార్గమని, లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం సాధ్యమవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 బెంచీలను ఏర్పాటు చేసి భారీ సంఖ్యలో కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు. సమయం, ధనం ఆదా చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ కక్షిదారులకు పిలుపునిచ్చారు. కక్షిదారుల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో విచారణలు జరుగుతాయని, లోక్ అదాలత్ ఇచ్చే తీర్పు అంతిమమని ఆయన స్పష్టం చేశారు.
Admin
Studio18 News