Studio18 News - తెలంగాణ / : Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి కేటీఆర్ వల్ల సినీ నటుడు అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయారని ఆమె ఆరోపించారు. సురేఖ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తో పాటు.. టాలీవుడ్ ప్రముఖులు ఖండించారు. అక్కినేని నాగార్జు, అక్కినేని అమల, అక్కినేని నాగచైతన్యతో పాటు.. పలువురు సినీ ప్రముఖులు కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని కోరారు. మంత్రి వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత కూడా స్పందించారు. తన ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దని, విడాకులనేవి పూర్తిగా తన వ్యక్తిగత విషయం అని సమంత చెప్పుకొచ్చింది. మా విడాకుల్లో రాజకీయ నేతల ప్రమేయం లేదని చెప్పింది. అనవసరంగా మీ రాజకీయాల్లో నన్ను లాగకండి. నేనెప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంటానని సమంత అంది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టింది. తాజాగా సమంత పోస్టుకు మంత్రి కొండా సురేఖ రియాక్ట్ అయ్యారు. సురేఖ తన ట్విటర్ ఖాతాలో సమంతను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ.. సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ, ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే భేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. అన్యదా భావించవద్దని కొండా సురేఖ పేర్కొన్నారు. అయితే, కొండా సురేఖ కేవలం సమంతను ఉద్దేశించి మాత్రమే ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. నాగార్జు, అమల, ఇతర టాలీవుడ్ నేతల ట్వీట్లకు కొండా సురేఖ స్పందించలేదు.
Admin
Studio18 News