Studio18 News - TELANGANA / : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో డ్రామాలాడుతున్నారని కాంగ్రెస్ లోక్ సభ సభ్యుడు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో అమాయక రైతులు, ప్రజలను అధికారుల పైకి రెచ్చగొట్టింది కేటీఆర్ కాదా? అని ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... పదేళ్ల పాటు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌కు అధికారం ఇస్తే ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. లగచర్ల ఘటనకు కారణం కేటీఆర్ అని తేలిందని, అందుకే ఆయన కొత్త డ్రామాలకు తెరలేపారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు రైతుల ముసుగులో కలెక్టర్, అధికారుల మీద దాడి చేశారని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు పథకం ప్రకారమే ఆ పార్టీ కుట్రలు చేస్తోందన్నారు. లగచర్ల ఘటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జరిగిన దాడి కాదని, ప్రజాస్వామ్య పాలనపై జరిగిన దాడి అన్నారు. ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రజలను రెచ్చగొడుతోందని ఆరోపించారు.
Also Read : వాలంటీర్ వ్యవస్థ లేదనడం దారుణం: బొత్స సత్యనారాయణ
Admin
Studio18 News