Friday, 14 February 2025 07:38:28 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Revanth Reddy: హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం: సీఎం రేవంత్ రెడ్డి

Date : 02 August 2024 05:00 PM Views : 56

Studio18 News - TELANGANA / : క్రీడల విషయంలో హర్యానా రాష్ట్రం విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. బాక్సర్ నిఖత్ జరీన్, క్రికెటర్ సిరాజ్‌లకు డీఎస్పీ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన బిల్లుపై శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... త్వరలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌ను బ్యాగరికంచెకు షిఫ్ట్ చేయాలని భావిస్తున్నామన్నారు. అక్కడే స్కిల్ యూనివర్సిటీ పక్కన మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను నిర్మించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం బీసీసీఐతో చర్చించామన్నారు. అంతర్జాతీయస్థాయి క్రికెట్ స్టేడియాన్ని నిర్మించాలని బీసీసీఐని కోరామని, వారు కూడా అందుకు ముందుకు వచ్చారన్నారు. స్పోర్ట్స్ కోసం నిధులతో పాటు ప్రత్యేక కార్యాచరణ ఉంటుందన్నారు. క్రీడాకారులను అన్నివిధాలుగా ప్రోత్సహిస్తామన్నారు. నిఖత్ జరీన్‌కు ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు. సిరాజ్‌కు విద్యార్హత లేకపోయినప్పటికీ గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నట్లు చెప్పారు. రానున్న అసెంబ్లీ సమావేశాలల్లో స్పోర్ట్స్ పాలసీని ప్రవేశ పెడతామన్నారు. స్పోర్ట్స్ స్టేడియంల ఏర్పాటును ప్రోత్సహించే అంశంపై దృష్టి సారించామన్నారు. బీజేపీ సభ్యుడు చెప్పినట్లు మండలానికి ఓ మినీ స్టేడియం నిర్మిస్తే ఉపయోగంగా ఉంటుందన్నారు. కానీ తెలంగాణలో భూముల విలువ బాగా పెరిగి.. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయన్నారు. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు లేకుండా పోయాయన్నారు. ఏ మండల కేంద్రంలోనైనా ప్రభుత్వ భూమి ఉంటే స్టేడియం నిర్మాణానికి బడ్జెట్ కేటాయించేందుకు తాము సిద్ధమన్నారు. యువతను వ్యసనాల నుంచి బయటకు తీసుకురావడానికి క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ఈ సభపై ఆ బాధ్యత ఉందన్నారు. సభ్యులు సూచనలు, సలహాలు ఇస్తే క్రీడావిధానానికి పరిశీలిస్తామన్నారు. యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియం సినిమా ఫంక్షన్లకు అంకితమైతే, గచ్చిబౌలిలోని స్టేడియం పెళ్లిళ్లు, పేరంటాలకు, సరూర్ నగర్ స్టేడియం, ఎల్బీనగర్ స్టేడియం రాజకీయ పార్టీల సమావేశాలకు ఉపయోగిస్తున్నారన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే బడ్జెట్‌లో క్రీడల కోసం రూ.321 కోట్లు కేటాయించామన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :