Sunday, 08 March 2026 04:50:43 PM
# మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన

అంతా క్షేమం.. ఖమ్మం మున్నేరు బ్రిడ్జిపై చిక్కుకున్న తొమ్మిది మంది సురక్షితంగా బయటకు..

Date : 02 September 2024 11:20 AM Views : 489

Studio18 News - TELANGANA / : Khammam Flood : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురుస్తుండటంతోపాటు.. మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించింది. అంతకుముందు ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపైకి వెళ్లిన తొమ్మిది మంది ఆదివారం సాయంత్రం బ్రిడ్జిపై చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయంతో వారిని బయటకు రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, అప్పటికే స్థానికులు ఏర్పాటు చేసిన జేసీబీల సాయంతో మరోవైపు నుంచి బ్రిడ్జిపై చిక్కుకున్న తొమ్మిది మంది సురక్షితంగా బయటకు వచ్చారు. తొమ్మిది గంటల ఉత్కంఠకు తెరపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆదివారం సాయంత్రం ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై తొమ్మిది మంది చిక్కుక్కున్న విషయాన్ని తెలుసుకున్న అధికారులు వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేరుగా రంగంలోకిదిగి వారిని కాపాడే చర్యలను పర్యవేక్షించారు. నేవీ హెలికాప్టర్ ను రప్పించేలా ప్రయత్నాలు చేశారు. నేవీ హెలికాప్టర్ విజయవాడ వచ్చే సమయానికే చీకటి పడటంతో తాము రాలేమని నేవీ సిబ్బంది తెలియజేశారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం ఇచ్చారు. వారు రాత్రి పొద్దుపోయాక వచ్చి బ్రిడ్జిపై చిక్కుకున్న వారిని కాపాడేందుకు బ్రిడ్జిపై వెళ్లగా.. అప్పటికే మరోవైపు నుంచి స్థానికులు ఏర్పాటు చేసిన జేసీబీల సాయంతో బ్రిడ్జిపై చిక్కుకున్న తొమ్మిది మంది సురక్షితంగా బయటకు వెళ్లినట్లు గుర్తించారు. బ్రిడ్జిపై చిక్కుకున్నవారు సురక్షితంగా బయటకు వచ్చారని ముందుగానే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇవ్వకపోవటంతో మంత్రి తుమ్మల కలెక్టర్, సీపీపై సీరియస్ అయ్యారు. అయితే, బ్రిడ్జిపై చిక్కుకున్న తొమ్మిది మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడటంతో అందరూ ఊపీరిపీల్చుకున్నారు. దాదాపు తొమ్మిది గంటలపాటు ప్రకాశ్ నగర్ మున్నేరు బ్రిడ్జిపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బాధితులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అంతకుముందు డ్రోన్లు సాయంతో బాధిత కుటుంబ సభ్యులు వారికి భోజనాలు అందజేశారు. అధికారులు కనీస చర్యలు చేపట్టలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే, స్వయాన మంత్రి తుమ్మల రంగంలోకిదిగి వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. చివరికి వారు సురక్షితంగా బయటకు రావటంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :