Friday, 14 February 2025 06:44:26 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

Bandi Sanjay: అక్కడ అంత దారుణం జరుగుతుంటే... రాహుల్ గాంధీ చైనా ఆదేశాలనే పాటిస్తుంటాడు: బండి సంజయ్

Date : 12 August 2024 04:24 PM Views : 54

Studio18 News - TELANGANA / : బంగ్లాదేశ్ పరిణామాలు, హింసపై లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ ప్రశ్నించారు. ఆయన ఎప్పుడూ శ్యాంపిట్రోడా భాషనే మాట్లాడుతారని, చైనా చెప్పినట్లు నడుచుకుంటారని విమర్శించారు. కరీంనగర్‌లో యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జాతీయ పతాకాన్ని సగౌరవంగా ప్రతి ఇంటిపై ఎగరవేయాలని... తద్వారా భారత జాతి ఐక్యతను ప్రదర్శించాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మహనీయుల త్యాగాలను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. నెహ్రూ కుటుంబానికి లాభం జరిగేలా... నెహ్రూ కుటుంబం భజన చేయడమే లక్ష్యంగా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ నడిచిందన్నారు. మహనీయుల చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కానీ మహనీయుల చరిత్ర తరతరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. వర్గాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో ఈ దేశాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. మైనార్టీ సంతుష్టీకరణ విధానాలతో దేశాన్ని చీల్చిందని మండిపడ్డారు. నెహ్రూ అరాచకం వల్ల... అనాలోచిత విధానం వల్ల ఆ రోజు లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోగా, కోట్లాది మంది నిరాశ్రయులయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ స్ఫూర్తితో నరేంద్రమోదీ పాలన కొనసాగుతోందన్నారు. దానికి నిలువెత్తు నిదర్శనం 370 ఆర్టికల్ రద్దు అని వెల్లడించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :