Sunday, 29 March 2026 05:19:33 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Komatireddy Raj Gopal Reddy: ఏదో ఒక రోజు బాంబు పేలుస్తా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Date : 28 January 2026 07:24 PM Views : 75

Studio18 News - TELANGANA / HYDERABAD : మునుగోడు అభివృద్దికి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం జరుగుతోందన్న రాజగోపాల్ రెడ్డి అభివృద్ధిలో మునుగోడు వెనుకబడిందని ఆవేదన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పనులకు బిల్లులు చెల్లించడం లేదని విమర్శ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడంలో ఇలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు బాంబు పేల్చడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తనకు పదవి రాకున్నా పర్వాలేదని, కానీ ప్రజల సమస్యలు తీరకపోతే ఏమైనా జరిగిపోతుందని ఆయన స్పష్టం చేశారు. నల్లొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పనులు చేపట్టిన బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు సగంలో నిలిపివేసి చేతులెత్తేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని, వారం రోజుల్లో పూర్తిస్థాయి బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చిన సీఎం మూడు వారాలు గడిచినా ఒక్క బిల్లు కూడా చెల్లించలేదని అన్నారు. రాష్ట్రంలో కేవలం సీఎం, మంత్రుల నియోజకవర్గాలలోనే అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేసుకుంటున్నారు తప్ప ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో బిల్లులు ఇవ్వకపోగా నూతన పనులను కూడా మంజూరు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ప్రజల ప్రాణాలకు హాని కలిగించే మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు నియంత్రించేందుకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో బెల్టు దుకాణాలు నివారించకపోతే తానే మహిళలతో కలిసి గ్రామాల్లో పర్యటించి బెల్టు దుకాణాలను ధ్వంసం చేస్తానని హెచ్చరించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :