Studio18 News - TELANGANA / JAGTIAL : జగిత్యాల (స్టూడియో 18 న్యూస్ ప్రతినిధి) : నిర్మల్ జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం బాసర శ్రీజ్ఞానసరస్వతి ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారిపై జరిగిన దాడిని ఖండిస్తూ బ్రాహ్మణ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని TBSSS రాష్ట్ర కోశాధికారి సముద్రాల విజయసారధి, బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కే౦ద్రంలో బ్రాహ్మణ సంఘాల నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. నిత్యం అమ్మవారి సేవలో కాలంగడిపే బాసర శ్రీజ్ఞానసరస్వతి ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారిపై దాడి చేయడం అమానుషమని, ఇటివలి కాలంలో బ్రాహ్మణ జాతిపై విద్వేషాన్ని రగిలిస్తూ బ్రహ్మణులపై కొంతమంది అవాకులు, చెవాకులు పెలుతున్నారని, మరోవైపు ప్రత్యక్ష దాడులకు సైతం పాల్పడుతున్నారని మండిపడ్డారు. సమాజక్షేమంకోరి నిత్యం దైవారాధనలో నిమగ్నమయ్యే బ్రాహ్మణులపై దాడులు తగదని హితవు పలికారు. ఇప్పటికైన బ్రాహ్మణ జాతిపై దాడులను ఆపాలని, మరొక మారు ఇలాంటివి జరగకుండా బ్రాహ్మణ జాతి రక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రహ్మణ జాతిపై దాడి చేసే ఎంతటి వారికైన కటిన శిక్షలు అమలు చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. బాసర ఆలయ పూజరిపై జరిగిన దాడిపై సమగ్ర విచారణ చేపట్టి నిందితులను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీబీఎస్ఎస్ యువ నాయకులు ధీరజ్ కృష్ణమాచారి, యశస్వి భరద్వాజ్, జగిత్యాల బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు చాకుంట వేణు మాధవరావు, సిరిసిల్ల రాజేంద్ర శర్మ తదితరులు పాల్గోన్నారు.
Also Read : శశిథరూర్‌పై వేటేద్దామా? వద్దా?.. డైలమాలో కాంగ్రెస్
Admin
Studio18 News