Sunday, 08 March 2026 09:39:34 PM
# భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు ఘన ఏర్పాట్లు # ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సహాయం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ మహిళా కార్మికులకు సన్మానం # అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ సభ నిర్వహణ # టీజీఎస్‌ఆర్టీసీ డిపోలలో మహిళా దినోత్సవ వేడుకలు # బాలికల ఆరోగ్య రక్షణకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం # స్నేహానికి నిలువెత్తు నిదర్శనం… స్నేహితురాలికి రూ.70 వేల ఆర్థిక సహాయం # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా నాయకులకు సన్మానం # వేములవాడ హత్య కేసును ఛేదించిన పోలీసులు # మహిళల సమాన హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది # మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కానిస్టేబుల్‌కు సన్మానం # మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీలో మహిళా సిబ్బందికి సన్మానం # బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి # రైతుబంధుపై సీఎం విమర్శలకు నైతిక హక్కులే లేవు: జోగు రామన్న # భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం # ఆర్మూర్‌లో పాత ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం # షాబాద్ రైతు వేదికలో రైతులకు శిక్షణ కార్యక్రమం # అంతర్జాతీయ స్థాయిలో గ్రావిటీ ఫార్మా ఔషధాల విశ్వసనీయత # నారపల్లిలో ‘ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్’ విజయవంతం # అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య

Habsiguda: హబ్సిగూడలో విషాదం.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక పిల్లలను చంపి ఉరేసుకున్న దంపతులు

ఏడాది క్రితం కల్వకుర్తి నుంచి హబ్సిగూడకు వచ్చిన కుటుంబం ఆరు నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో వెంటాడిన ఆర్థిక సమస్యలు కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేస

Date : 11 March 2025 01:40 PM Views : 476

Studio18 News - TELANGANA / HYDERABAD : హైదరాబాద్‌లోని హబ్సిగూడలో పెను విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి (44), కవిత (35) దంపతులు ఏడాది క్రితం హబ్సిగూడకు వచ్చారు. వీరికి విశ్వాన్‌రెడ్డి (10), శ్రీతరెడ్డి(15) సంతానం. చంద్రశేఖర్‌రెడ్డి కొంతకాలంపాటు ఒక ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసి మానేశారు. ఆరు నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు వెంటాడాయి. ఈ నేపథ్యంలో నిన్న కుమారుడు విశ్వాన్‌రెడ్డికి విషమిచ్చి, కుమార్తె శ్రీతరెడ్డికి ఉరివేసి చంపేశారు. ఆపై భార్యాభర్తలు ఇద్దరూ ఉరివేసుకున్నారు. తన చావుకి ఎవరూ కారణం కాదని, వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనను క్షమించాలంటూ చంద్రశేఖర్‌రెడ్డి రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కెరీర్‌ పరంగాను, శారీరకంగాను, మానసింగాను సమస్యలు ఎదుర్కొంటున్నానని, షుగర్, నరాలు, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్టు చంద్రశేఖర్‌రెడ్డి అందులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :