Studio18 News - తెలంగాణ / : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీరు సరిగా లేదని, ఆంధ్ర-తెలంగాణ అంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. అరికెపూడి గాంధీ ఇంటికి దానం నాగేందర్ వెళ్లి, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర వాళ్ల ఓట్లమే కావాలని, వ్యాపారాలు చేస్తే డబ్బులు కావాలని, రాజకీయాల్లో మాత్రం ఆంధ్ర-తెలంగాణ అంటూ రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సహచర ఎమ్మెల్యే కాబట్టి తనను బ్రేక్‌కు పిలిచారని, అందుకే తాను గాంధీ నివాసానికి వచ్చానని చెప్పారు. ఆంధ్ర-తెలంగాణ అనేది పాడి కౌశిక్ చెప్పిన మాటలా లేక బీఆర్ఎస్ పార్టీ మాటలా? అని అన్నారు. శేరిలింగంపల్లి బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయాలంటే జిల్లా పార్టీ ఆఫీసులో చేయాలని, లేదంటే తెలంగాణ భవన్ లో చేయాలని చెప్పారు. అరికెపూడి గాంధీ ఇంట్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు అనడం ఏంటనిన నిలదీశారు. కౌశిక్ రెడ్డి లాంటి వాళ్లు తమను రెచ్చగొట్టొద్దని, రెచ్చకొడితే తమను తట్టుకోలేరని చెప్పారు. మహిళలపై కించపరిచే వ్యాఖ్యలు చేయడం కౌశిక్ కు అలవాటుగా మారిందని అన్నారు. తమ మహిళలు తలుచుకుంటే కౌశిక్ ఒంటిపై బట్టలు లేకుండా చేస్తారని, కౌశిక్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డికి మహిళలంటే లెక్కలేదని అన్నారు.
Admin
Studio18 News