Friday, 14 February 2025 08:17:06 AM
# భార్యను చంపిన గురుమూర్తిలో కొంచెమైనా పశ్చాత్తాపం లేదు: రాచకొండ సీపీ # #visakhapatnam : దువ్వారపు జన్మదిన వేడుకలకు కదిలిన బీసీ నేతలు # #visakhapatnam : అమ్మాయితో వల విసిరి, మాయ మాటలతో నమ్మించి.. # #nagarkurnool : విద్యార్థినిల పైకి చెప్పు ! ఉపాధ్యాయుడి దేహశుధ్ధి చేసిన పేరంట్స్ .. # #jagtial : బాలికల పాఠశాలలో కండోమ్ ప్యాకెట్లు # #jagtial : పార్క్ సందర్శించిన ఎమ్మెల్సీ # #karimnagar : కమలం గూటికి కరీంనగర్ మేయర్ .. ఎమ్మెల్యే గంగులపై తీవ్ర విమర్శలు # #jagtial : మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం # #hyderabad : మంద కృష్ణకు పద్మ శ్రీ # #hyderabad : అంబేద్కర్ విగ్రహ దిమ్మ ధ్వంసం ! ఉద్రిక్తత !! # దేశ భవిష్యత్తు ఓటర్ల చేతిలో ఉంది : కలెక్టర్ బీఎం సంతోష్ # బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం # #JogulambaGadwal : కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న వర్గపోరు. # రూ.10 లక్షల వరకు ఆదాయంపై నో ట్యాక్స్‌.. # #nagarkurnool : ఎమ్మెల్యే ని విమర్శించేవారు ఆత్మపరిశీలన చేసుకోవాలి # #nagarkurnool : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి డీఎస్పీ శ్రీనివాస్ # #hyderabad : అట్టహాసంగా అంతర్ పాఠశాల క్రీడా పోటీలు # #nagarkurnool : గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ # అర్బన్ పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే # హైదరాబాద్‌ కిడ్నీ రాకెట్ కేసులో కీలక పరిణామం

భారీ వర్షాలకు నీట మునిగిన భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థాన ప్రాంతం

Date : 07 August 2024 11:03 AM Views : 55

Studio18 News - TELANGANA / : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థాన ఆలయ అన్నదాన సత్రం భారీ వర్షాలకు నీట మునిగింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షానికి రామాలయ ప్రాంతం తడిసి ముద్దయింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినా ఇరిగేషన్ అధికారుల తీరు మారలేదు. గోదావరి నది కరకట్ట స్లూయిజ్ ల నుంచి వర్షపు నీటిని పంప్ చెయ్యకపోవడం వల్ల మరో సారి నీట మునిగింది రామాలయ ప్రాంతం. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద పోటెత్తింది. పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులుకాగా, ప్రస్తుత నీటిమట్టం 404.10అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 4,000 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 10,000 క్యూసెక్కులు ఉండడంతో 2 గేట్లు ఎత్తారు. 10,000 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని నదీ ప్రవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గుండాల, ఆళ్ళపల్లి ఏజెన్సీ మండలాలలో భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. పెనుబల్లి మండలం లంకాసాగర్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 16 అడుగులుగా ఉంటుంది. ప్రస్తుత నీటి మట్టం 16.09 అడుగులకు చెరుకోవటంతో అలుగు పారుతోంది. వేంసూరు మండలంలో అత్యధికంగా 66.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తల్లాడ మండలంలో అత్యల్పంగా 24.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :