Studio18 News - తెలంగాణ / : హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను ఇలాగే కూలుస్తూ పోతే బంగ్లాదేశ్‌లో ఇటీవల తలెత్తిన పరిస్థితులే ఇక్కడా వస్తాయని హెచ్చరించారు. నిన్న ఓల్డ్ బోయినపల్లిలోని హస్మత్‌పేటలోని బోయిన్ చెరువును పరిశీలించిన ఆయన స్థానికులతో మాట్లాడారు. శని, ఆదివారాలు వస్తున్నాయంటే చెరువుల సమీపంలో నివసిస్తున్న పేదల గుండెల్లో గుబులు మొదలవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. పేదలను లక్ష్యంగా చేసుకోవడం తగదని ప్రభుత్వానికి హితవు పలికారు. కూకట్‌పల్లి సున్నం చెరువు సమీపంలోని పద్మావతి నగర్ నివాసితులకు హైడ్రా అధికారులు నోటీసులు జారీచేసిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే తన పర్యటన సందర్భంగా హరిజన్ బస్తీ వాసులకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Admin
Studio18 News