Sunday, 29 March 2026 05:25:14 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Pawan Kalyan: పవన్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి.. ఇక్కడ ఆయన మాట విని ఓటేసే వారు లేరు: మహేశ్ గౌడ్

Date : 04 February 2026 07:31 PM Views : 50

Studio18 News - TELANGANA / HYDERABAD : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పవన్ ప్రచారం చేస్తారంటూ వార్తలు పవన్ తెలంగాణ వ్యతిరేకి అని ఆరోపించిన మహేశ్ గౌడ్ పవన్‌ను బీజేపీ నేతలు 'భిక్షాం దేహీ' అని అడిగారంటూ ఎద్దేవా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ ఒక ఆంధ్ర నాయకుడని, ఆయన తెలంగాణ వ్యతిరేకి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పవన్ తన రాజకీయాలను ఆంధ్రాలోనే చేసుకోవాలని, తెలంగాణలో ఆయన ప్రచారం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మహేశ్ గౌడ్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి."బీజేపీ నేతలు పవన్ కల్యాణ్‌ను భిక్షాం దేహీ అని అడిగారు" అని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో పవన్ తెలంగాణ గురించి చాలా నీచంగా మాట్లాడారని, అలాంటి వ్యక్తి మాటలు విని ఇక్కడి ప్రజలు ఓట్లు వేయరని అన్నారు. ఆయన మాటలను ఎవరూ విశ్వసించరని, ఆయన ప్రభావం తెలంగాణ రాజకీయాలపై శూన్యమని స్పష్టం చేశారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :