Monday, 15 December 2025 12:44:26 AM
# Roja: ఇక జీవితంలో నగరిలో గెలవలేవు: రోజాకు స్థానిక నేతల వార్నింగ్ # Kapil Sharma: కేవలం కమెడియన్ కాదు.. రూ.300 కోట్ల సామ్రాజ్యం అతడి సొంతం.. కపిల్ శర్మ సక్సెస్ స్టోరీ # Kalluri Balaraju: రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి # Sreelekha: కేరళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. కౌన్సిలర్‌గా గెలిచిన మాజీ డీజీపీ శ్రీలేఖ # Mamata Banerjee: స్టేడియంలో గందరగోళం... మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమతా బెనర్జీ # SBI: ఎస్‌బీఐ కీలక నిర్ణయం.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ రేట్లు # Tuvalu: కనుమరుగవుతున్న దేశం... ఆ దేశ పౌరులకు తలుపులు తెరిచిన ఆస్ట్రేలియా # Pemmasani Chandrasekhar: అమరావతి రైతులకు కేంద్ర మంత్రి పెమ్మసాని స్పష్టత.. భూములివ్వకుంటే సేకరణే! # Akhanda 2: బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్.. ‘అఖండ 2’ ఫ‌స్ట్ డే కలెక్షన్స్‌ను అధికారికంగా ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌ # Puneet Chandok: ఇలాంటి ఉద్యోగాలు మన తరంతోనే ఆఖరు: మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ పునీత్ చందోక్ # Vasamshetti Subhash: విశాఖను నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి వాసంశెట్టి సుభాశ్ # Kulendra Sharma: పాక్ గూఢచర్యం: అసోం రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి అరెస్ట్ # Anshuman Kaushal: మీ పిల్లలను ఫుడ్డుతో ప్రేమించాలని చూడొద్దు... ఓ డాక్టర్ పోస్ట్ వైరల్ # 'త్రీ రోజెస్ 2' (ఆహా) సిరీస్ రివ్యూ! # Bhagwant Mann: రాహుల్, సిద్ధూలకు ఒకే సమస్య.. పని చేయకుండానే పదవులా?: భగవంత్ మాన్ # Lionel Messi: కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్ గందరగోళం... నిర్వాహకుడి అరెస్ట్ # Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి పాట... లక్ష మందితో లిరిక్ షీట్ ఆవిష్కరణ # Indigo Airlines: పుంజుకుంటున్న ఇండిగో కార్యకలాపాలు... నేడు కూడా 2 వేలకు పైగా విమానాలు # Anil Chauhan: మాటలతో యుద్ధాలు గెలవలేం, స్పష్టమైన చర్యలతో విజయం సాధిస్తాం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ # Nitish Kumar Reddy: హ్యాట్రిక్ ఫీట్ పై నితీశ్ కుమార్ రెడ్డి కామెంట్స్

త్రిభాషా విధానం కొత్తదేమీ కాదన్న కిషన్ రెడ్డి హిందీని బలవంతంగా రుద్దుతున్నారని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆవేదన పునర్విభజనతో సీట్లు తగ్గవన్న కిషన్

త్రిభాషా విధానం కొత్తదేమీ కాదన్న కిషన్ రెడ్డి హిందీని బలవంతంగా రుద్దుతున్నారని అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఆవేదన పునర్విభజనతో సీట్లు తగ్గవన్న కిషన్

Date : 15 March 2025 04:49 PM Views : 356

Studio18 News - TELANGANA / : తమిళ భాషలో తీసిన సినిమాలు హిందీలోకి డబ్ చేసి నిర్మాతలు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. త్రిభాషా విధానం దేశంలో కొత్తదేమీ కాదని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా హిందీని రుద్దుతోందని అబద్దపు ప్రచారం చేస్తున్నారని, ఎవరి పైనా హిందీని రుద్దే ప్రయత్నం చేయడం లేదని స్పష్టం చేశారు. ఏ భాష కావాలంటే ఆ భాషలో చదువుకునే అవకాశం ఉందని తెలిపారు. భాష పేరుతో దేశాన్ని విభజించడం సరికాదని ఆయన అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కూడా కిషన్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రిగా ఏం చేశాడో చెప్పి స్టాలిన్ తమిళ ప్రజలను ఓట్లు అడగాలని సూచించారు. తమిళనాడులో ఆయన ఏమీ చేయలేదని, అందుకే భాష, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. డీలిమిటేషన్‌తో దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయనేది వట్టి మాటేనని అన్నారు. కిషన్ రెడ్డి రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌తో కలిసి కిషన్ రెడ్డి ​నేడు బేగంపేట రైల్వే స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోందని అన్నారు. రైల్వేలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని తెలిపారు. బేగంపేట రైల్వే స్టేషన్‌లో మరో పది శాతం పనులు పూర్తి కావాల్సి ఉందని, త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రూ. 26.55 కోట్లతో మొదటి విడత పనులు జరుగుతున్నట్లు తెలిపారు. మరో రూ. 12 కోట్ల నిధులతో రెండో విడత పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రయాణికులకు ఇబ్బందిలేకుండా దశలవారీగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు రైల్వే స్టేషన్‌కు రావాల్సి వస్తే ముక్కు మూసుకొని వచ్చేవారమని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రైల్వే స్టేషన్ పేరుతో ఎన్నో మార్పులు తీసుకువచ్చినట్లు చెప్పారు. బేగంపేట రైల్వే స్టేషన్‌లో అందరూ మహిళలే ఉండేలా చూస్తామని కేంద్ర మంత్రి అన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :