Tuesday, 18 November 2025 04:36:57 PM
# Ashes Series | కమిన్స్ ఫిట్‌.. యాషెస్‌ తొలి టెస్టులో ఆడేనా..! # Tollywood | ‘ఐబొమ్మ’ పైరసీ వెబ్‌సైట్ క్లోజ్.. సజ్జ‌నార్‌ని క‌లిసిన టాలీవుడ్ ప్ర‌ముఖులు # United Airlines: భార్య లగేజీలో బాంబు... భర్త బెదిరింపుతో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ # Rasha Thadani | ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. జోడీగా ఎవ‌రు అంటే..! # Nagarjuna | శివ వైబ్స్‌ రీక్రియేట్‌ చేస్తున్న నాగార్జున.. ఇంతకీ ఏం ప్లాన్ చేస్తున్నాడేంటి..? # 'భగవత్ చాప్టర్ 1: రాక్షస్' (జీ 5)మూవీ రివ్యూ! # allu arjun | అల్లు అర్జున్‌ ఫోన్‌ వాల్‌పేపర్‌ గమనించారా..? ఆ రూల్‌నే ఫాలో అవుతామంటున్న ఫ్యాన్స్‌ # Chiru – Bobby | చిరు-బాబీ మూవీపై క్రేజీ అప్‌డేట్‌.. షూటింగ్ ఎప్పుడంటే..! # Akhanda 2 | భీమ్లానాయక్‌ భామతో బాలకృష్ణ స్టెప్పులు.. అఖండ 2 నుంచి జాజికాయ సాంగ్‌ ఆన్‌ ది వే # Heeramandi 2 | ‘హీరామండి 2’లో త‌మ‌న్నా – కాజ‌ల్ అగ‌ర్వాల్ .. భ‌న్సాలీ సీక్వెల్ పై భారీ చర్చ! # Saudi bus accident: సౌదీ ప్రమాదం: మృతుల్లో మల్లేపల్లి బజార్ ఘాట్ వాసులు 18 మంది # Shivaji | చాలా మందికి ఉపయోగపడుతున్నాననుకున్నాడు కానీ.. ఐబొమ్మ రవిపై యాక్టర్ శివాజీ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ # Kumar Sangakkara: సంగక్కర మళ్లీ హెడ్ కోచ్.. జడేజా, శామ్ కరన్‌తో రాజస్థాన్ కొత్త లుక్ # అదే జరిగితే.. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారు.. సీపీఐ రామకృష్ణ ఆగ్రహం # Chiranjeevi: వేలమంది కష్టాన్ని ఒక్కడే దోచేశాడు: ఐబొమ్మ నిర్వాహకుడిపై చిరంజీవి ఆగ్రహం # TTD | రేపు ఫిబ్రవరి కోటా శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల విడుదల # Tirumala | తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే ? # Dhruv Vikram: ఓటీటీకి తమిళ హిట్ మూవీ! # Pawan Kalyan | హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌, పోలీసులకు పవన్‌కల్యాణ్‌ అభినందనలు # Balakrishna: బాలయ్య జోలికి వస్తే చర్మం ఒలిచేస్తా: వైసీపీకి ఎమ్మెల్యే మాస్‌ వార్నింగ్

Jubleehills | జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీకి భారీ షాక్.. చెర్క మ‌హేశ్ రాజీనామా

Jubleehills | జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి భారీ షాక్ త‌గిలింది. మాజీ జాయింట్ క‌న్వీన‌ర్ చెర్క మ‌హేశ్ బీజేపీ స‌భ్య‌త్వానికి, ప

Date : 11 October 2025 07:37 PM Views : 93

Studio18 News - TELANGANA / HYDERABAD : Jubleehills | హైద‌రాబాద్ : జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి భారీ షాక్ త‌గిలింది. మాజీ జాయింట్ క‌న్వీన‌ర్ చెర్క మ‌హేశ్ బీజేపీ స‌భ్య‌త్వానికి, పార్టీకి రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డి, బీజేపీ గుట్టుచప్పుడు కాకుండా చేతులు కలిపి తెలంగాణను మోసం చేస్తున్నారని మ‌హేశ్ మండిప‌డ్డారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రజలను మోసం చేశారు. రైతులు, యువత, మహిళలు, బీసీలు బాధలో ఉన్నా బీజేపీ మౌనంగా ఉందని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. అలాంటి బీజేపీ పార్టీలో నేను కొనసాగలేనని టీబీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుకు చెర్క మ‌హేశ్ త‌న రాజీనామా లేఖ‌ను పంపారు. చెర్క మ‌హేశ్ రాజీనామా లేఖ సారాంశం.. గత కొన్ని సంవత్సరాలుగా నేను పార్టీకి నిజాయితీగా మరియు అంతఃకరణ శుద్ధితో పనిచేశాను. నేను నమ్మిన రాజకీయాలు ప్రజలకు సేవచేసి రాష్ట్రాన్ని బలోపేతం చేయడం. కానీ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను సరిగా పట్టించుకోలేదు, రైతులకు, యువకులకు, మహిళలకు, కుల వృత్తుల కార్మికులకు నిరాశే మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం మరియు జీవితాలను పణంగా పెట్టి రాజకీయాలు చేయడం జరిగింది. ఇది నాకు ఎంతో బాధ కలిగించింది. దేశంలో కాంగ్రెస్ మరియు బీజేపీ శతృత్వం తెలియంది కాదు. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బీజేపీ నాయకత్వం కలిసి అవకాశ రాజకీయాలు చేస్తూ 42% బీసీ రిజర్వేషన్స్‌పై సామాజిక న్యాయం కల్పించడానికి విఫలమయ్యారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా తెలంగాణకై పోరాడే పార్టీ, తెలంగాణ ప్రజల ఆశయాల మేరకు పని చేసే పార్టీ రావాల్సిన సమయం వచ్చింది. బీజేపీ పార్టీ ఏనాడూ తెలంగాణ కోసం కానీ, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి కానీ ప్రశ్నిస్తున్నట్లు అసెంబ్లీలో కానీ పార్లమెంట్‌లో కానీ కనబడటంలేదు. ఈ సమయంలో నా బాధ్యతగా స్వర్గీయ దివంగత నేత శ్రీ మాగంటి గోపినాథ్ గారు జూబ్లీహిల్స్ ప్రజలకు చేసిన సేవను గుర్తిస్తూ, ఈ కష్టకాలంలో వారి కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్యా, వారి సతీమణి శ్రీమతి సునీత మాగంటి గారికి అండగా ఉండటమే నా బాధ్యత అని బలంగా నమ్ముతున్నాను. తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, తెలంగాణ ప్రజల అస్తిత్వం కొరకై ఇకపై ఎటువంటి జాతీయ పార్టీలో నేను కొనసాగలేను అని గ్రహించి, బీజేపీ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను. నాకు ప్రజలకు సేవ చేసే అవకాశాలు కల్పించినందుకు బీజేపీ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లు, చెర్క మహేష్

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :