Sunday, 29 March 2026 05:22:06 AM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Land dispute | రాజేంద్రనగర్‌లో భూ వివాదం.. ప్రహరి గోడను కూల్చిన దుండగులు

Land dispute | రాజేంద్రనగర్‌లో భూ వివాదం పోలీసులకు ఫిర్యాదుచేసే వరకు వెళ్లింది. సన్ సిటీ దగ్గర ఓ ప్రైవేట్ స్థలంలో నిర్మించిన ప్రహరి గోడను దుండగులు జేస

Date : 05 February 2026 08:10 PM Views : 36

Studio18 News - TELANGANA / ADILABAD : హైదరాబాద్‌ : రాజేంద్రనగర్‌లో భూ వివాదం పోలీసులకు ఫిర్యాదుచేసే వరకు వెళ్లింది. సన్ సిటీ దగ్గర ఓ ప్రైవేట్ స్థలంలో నిర్మించిన ప్రహరి గోడను దుండగులు జేసిబీతో కూల్చివేశారు. దౌర్జన్యంగా ప్రైవేట్ స్థలంలోకి ప్రవేశించిన 100 మంది హంగామా చేశారు. స్థల యజమాని కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దాంతో భూ యజమాని రవి యాదవ్‌ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా 1935వ సంవత్సంరలో రవి యాదవ్‌ కుటుంబీకులు హైదర్షాకోట్ సర్వే నెంబర్ 16, 17, 18, 19 లో ఉన్న 39.24 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులో 39 ఎకరాల వ్యవసాయ పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ 39 ఎకరాల్లో 21 ఎకరాల పొలాన్ని 1971వ సంవత్సరంలో ఇండియన్ ఆర్మీకి ఇచ్చారు. అయితే సర్వే నెంబర్ 18/4 లో ఉన్న 33 గుంటల స్థలం వివాదంలో ఉంది. కొంతమంది ఆ స్థలం తమదంటూ దౌర్జన్యం చేశారు. ఫేక్ డాక్యుమెంట్‌లు సృష్టించి జేసీబీలతో రెచ్చిపోయారు. భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాదారులు ఆ ఖరీదైన భూమిపై కన్నేశారు. భూమి తమదని గొడవకు రావడంతో.. యజమాని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ తనపై దౌర్జన్యం చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని భూ యజమాని పోలీసులను కోరారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :