Studio18 News - తెలంగాణ / : కేసీఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అన్నారు. కానీ, ప్రచార ఆర్భాటం కోసం రూ.839 కోట్ల పెట్టుబడులు అని చెప్పి రాష్ట్రంలోకి మరో బోగస్ కంపెనీని తీసుకువస్తే ఎలా? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. పెట్టుబడులు తీసుకురావడంలో కేటీఆర్‌తో పోటీ పడాలని సూచించారు. కానీ ఫ్రాడ్ కంపెనీలు, బోగస్ కంపెనీలు తెచ్చి ప్రచారం ఎందుకు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... సీఎంగా ఎవరిని కలిసినా, ఎవరితో వ్యాపారం చేసినా వారి ట్రాక్ రికార్డ్ బాగుండాలని సూచించారు. ఇలా ఎవరిని పడితే వాళ్లను కలిసి, స్ట్రైక్‌ఆఫ్ అయిన కంపెనీతో ఒప్పందాలు చేసుకుని వస్తే ఎవరూ ఊరుకోరన్నారు. కేసీఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఐటీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయన్నారు. 2022-23 చూస్తే ఐటీ ఎగుమతులు రూ.57,706 కోట్లుగా ఉందని, 2023-24కి వచ్చేసరికి ఐటీ ఎగుమతులు రూ.26,948 కోట్లకు పడిపోయాయన్నారు. కాంగ్రెస్ పాలనలో పెట్టుబడులు సగానికి పడిపోయాయని విమర్శించారు. గతంలో దావోస్‌కు వెళ్లినప్పుడు రేవంత్ రెడ్డి చాలా ప్రచారం చేసుకున్నారని గుర్తు చేశారు. దావోస్‌లో గోధి ఇండియా అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారని, రూ.27 లక్షల వార్షిక లాభం లేని సంస్థ ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు ఎలా పెడుతుందని ప్రశ్నించారు. యాన్యువల్ స్టేట్‌మెంట్ తెప్పించి అడిగితే ముఖ్యమంత్రి గప్‌చుప్ అయ్యారని విమర్శించారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై రూ.లక్షన్నర కోట్లకు అంచనాలను పెంచారని విమర్శించారు. ఈ ప్రాజెక్టును మెయిన్ హార్ట్ అనే సంస్థకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం చూస్తోందన్నారు. మెయిన్ హార్ట్ సంస్థ పాకిస్థాన్‌లో రూ.3000 కోట్లు దోచుకుని పారిపోయి వచ్చిందన్నారు. ఆ సంస్థపై ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు, ఫెడరల్ ఏజెన్సీలు లుకౌట్ నోటీసులు ఇచ్చాయన్నారు. ఈ రెండు ఇలా ఉంటే, తెలంగాణలో రూ.839 కోట్ల పెట్టబడులకు వాల్ష్ కర్రా హోల్డింగ్స్‌తో ఒప్పందం జరిగిందని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార ఆర్భాటం కోసం రూ.839 కోట్ల పెట్టుబడులని చెప్పి రాష్ట్రంలోకి మరో బోగస్ కంపెనీని తీసుకువస్తే ఎలా? అన్నారు. వాల్ష్ కర్రా హోల్డింగ్స్ అనే కంపెనీ నాలుగు నెలల క్రితమే ప్రారంభమైందన్నారు. ఈ కంపెనీలో ఇద్దరే డైరెక్టర్లు ఉన్నారని చెప్పారు. వీళ్ల యాన్యువల్ స్టేట్‌మెంట్స్, రిపోర్ట్స్, పాత ట్రాక్ రికార్డులు ఏమీ లేవన్నారు. అలాంటివారు రూ.839 కోట్లు తీసుకొచ్చి తెలంగాణలో పెట్టుబడి ఎలా పెడతారన్నారు. ఫ్రాడ్ కంపెనీల కోసం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లారా? అని నిలదీశారు. తానేదో కేటీఆర్ కంటే మెరుగ్గా పని చేస్తున్నానని చెప్పుకోవడం కోసం సీఎం అమెరికా వెళ్లారని ఎద్దేవా చేశారు.
Admin
Studio18 News