Friday, 18 July 2025 07:17:35 AM
# బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ # కాంటా లగా' బ్యూటీ షఫాలీ మృతిలో మిస్టరీ.. అసలు కారణంపై పోలీసుల ఆరా! # గంభీర్ కోచింగ్‌పై తీవ్ర ఒత్తిడి.. అత‌ని కోచ్‌ పదవికే ప్రమాదం: ఆకాశ్ చోప్రా # గాజాలో ఆగని మారణహోమం: ఇజ్రాయెల్ దాడులతో 56,000 దాటిన మృతుల సంఖ్య # ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్: కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ # కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు # ఇరాన్ లో ఆ 400 కిలోల యురేనియం ఇప్పుడు ఎక్కడ? # కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్ # ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గంటల్లోనే తూట్లు.. మళ్లీ క్షిపణుల మోత! # ఛార్జీలు పెంచిన రైల్వే శాఖ... ఎప్పట్నించి అంటే! # ఆ స్థానం నుంచి రాజ్యసభకు వెళుతున్నారనే ప్రచారంపై స్పందించిన కేజ్రీవాల్ # ఎన్నికల వేళ ఫోన్ల ట్యాపింగ్: సిట్ చేతికి కీలక ఆధారాలు, వెలుగులోకి విస్తుపోయే నిజాలు! # పక్షే కదా అని తీసిపారేయొద్దు... మనుషుల్ని వేటాడుతుంది! # అమెరికా దాడుల్లో ఇరాన్ ఫోర్డో అణు కేంద్రానికి తీవ్ర నష్టం!: అణుశక్తి సంస్థ చీఫ్ వెల్లడి # చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి: డీవీఆర్ సైనిక్ స్కూలు ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేశ్ # జగన్ ను జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారు... అది ఫేక్ వీడియో: రోజా # ఆ సినిమాలో ఆ హీరోయిన్ ను వద్దన్నారు: దర్శకుడు రవిరాజా పినిశెట్టి # విద్యుత్ విమానం... ఇందులో ప్రయాణం నమ్మశక్యం కానంత చవక! # మూడు నెలల రేషన్ కోసం ఛత్తీస్‌గఢ్‌లో ఎలా పోటీపడ్డారో చూడండి! # మద్యం కుంభకోణం.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు

TGSRTC: ఆర్టీసీ బస్సులో గర్భిణీకి పురుడు పోసిన కండక్టర్... సజ్జనార్ ప్రశంసలు

Date : 19 August 2024 03:06 PM Views : 156

Studio18 News - TELANGANA / : గద్వాల్ - వనపర్తి ఆర్టీసీ బస్సులో ఓ మహిళకు పురిటి నొప్పులు రాగా బస్సు కండక్టర్ ఆమెకు పురుడు పోశారు. నర్సు సహాయంతో పురుడు పోసిన వారికి టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రశంసలు కురిపంచారు. ఇందుకు సంబంధించిన వివరాలను సజ్జనార్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రాఖీ పండుగ నాడు ఆర్టీసీ బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్‌ మానవత్వం చాటుకున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారని తెలిపారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. గద్వాల డిపోకు చెందిన గద్వాల-వనపర్తి రూట్‌ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధన్‌ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారని, బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయని పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్‌ జి భారతి బస్సును ఆపించారని, అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారని తెలిపారు. ఆ మహిళ పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చినట్లు వెల్లడించారు. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆసుపత్రికి తరలించారన్నారు. ప్ర‌స్తుతం త‌ల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని వెల్లడించారు. రక్షాబంధన్‌ బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్‌ భారతికి ఆర్టీసీ యాజమాన్యం తరపున సజ్జనార్ అభినందనలు తెలిపారు. తాను సమయస్పూర్తితో వ్యవహారించి నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే... ఆర్టీసీ ఉద్యోగులు సామాజిక బాధ్యతగా సేవాస్ఫూర్తిని చాటుతుండటం గొప్ప విషయమని పేర్కొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :