Saturday, 14 December 2024 06:28:18 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

KTR: నా మీద కక్షను రేవంత్ రెడ్డి సిరిసిల్ల నేతన్నల మీద తీర్చుకుంటున్నాడు: కేటీఆర్

Date : 26 September 2024 04:42 PM Views : 26

Studio18 News - తెలంగాణ / : రాజకీయంగా తన మీద ఉన్న కోపంతో రాజన్న సిరిసిల్ల ప్రజల మీద, నేతన్నల మీద పగ తీర్చుకుంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకపోవడంతో నేతన్నల కుటుంబాల రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో నేతన్నల ఆత్మహత్యలు జరిగాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తమ పార్టీ తరఫున రూ.50 లక్షలు పద్మశాలి ట్రస్ట్‌కు ఇచ్చి సిరిసిల్లను ఆదుకున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నేతన్నల కుటుంబాలకు అండగా నిలిచామన్నారు. కేసీఆర్ నేతన్నలకు ఉపాధి కల్పించి వారి కడుపు నింపారన్నారు. స్కూల్ యూనిఫామ్స్‌తో పాటు కేసీఆర్ కిట్‌లోని రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకకు ఇచ్చే చీరలను సిరిసిల్లలో తయారు చేయించినట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం దివాలాకోరు నిర్ణ‌యం వ‌ల్ల రాష్ట్రంలోని కోటిమందికి పైగా ఆడ‌బిడ్డ‌ల‌కు బ‌తుక‌మ్మ చీర‌లు బంద్ అయ్యాయని మండిపడ్డారు. బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ ప‌థ‌కం వెనుక ఉన్న ఉద్దేశం, ఆలోచ‌నపై ఈ సీఎంకు, ప్ర‌భుత్వానికి క‌నీస అవ‌గాహ‌న లేదని విమర్శించారు. నేత‌న్న‌ల స‌మ‌స్య‌ల‌పై అసెంబ్లీలో చెప్పే ప్ర‌య‌త్నం చేశానన్నారు. తన మీద రాజ‌కీయ క‌క్ష‌ ఉంటే తన మీదే తీర్చుకోవాలని, కానీ నేత‌న్న‌ల‌ను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. ఇది దివాలాకోరు, ప‌నికిమాలిన ప్ర‌భుత్వమని ధ్వజమెత్తారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :