Saturday, 07 March 2026 09:22:48 PM
# అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వస్తేనే సమాజ అభివృద్ధి: ప్రిన్సిపాల్ నర్సయ్య # కుర్దుల్‌పేట్‌లో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక స్వాధీనం… మార్చి 9న బహిరంగ వేలం # పెద్దవాల్గాట్‌లో పల్లె దవాఖాన, అంగన్‌వాడీ, పాఠశాలల పరిశీలన # సీఈఐఆర్ పోర్టల్ సహాయంతో ఆరు మొబైల్ ఫోన్లు యజమానులకు అప్పగింత # అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కలెక్టర్ శుభాకాంక్షలు # డ్రంకన్ డ్రైవ్‌పై కఠిన చర్యలు.. 246 కేసులు నమోదు # ఆరెంపుల జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు.. రామడుగులో ఘోరం # ధర్పల్లిలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఇఫ్తార్ విందు # వేములవాడలో ఘనంగా కొనసాగుతున్న శివకళ్యాణ మహోత్సవాలు # గంగాధర మండలంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన # కోడిమ్యాల మండలంలో కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటన – అభివృద్ధి పనుల పరిశీలన # ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్‌ఎస్ విమర్శలు # విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి: ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి # 10వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం # కార్మిక సమస్యలపై పోరాటానికి ఏఐటీయూసీ సిద్ధం # ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి: షబ్బీర్ అలీ # విద్యార్థులు ఇష్టంగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి: కలెక్టర్ రాజర్షి షా # రైతుబంధుపై సీఎం వ్యాఖ్యలు రైతుల అవమానం – క్షమాపణ చెప్పాలి: జోగు రామన్న # ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ ప్రారంభం

K.Kavitha: ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ వాయిదా

Date : 20 August 2024 03:21 PM Views : 394

Studio18 News - TELANGANA / : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జైలుపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వచ్చే మంగళవారం విచారణ జరుపుతామని ప్రకటించింది. లిక్కర్ కేసులో బెయిల్ కోసం కవిత తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కోర్టు ఆమె పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలంటూ సీబీఐ, ఈడీలను ఆదేశించింది. ఈ కేసులో సీబీఐ అధికారులు ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కి ఈ నెల 23 (శుక్రవారం) వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :