Saturday, 14 December 2024 06:42:07 PM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

AV Ranganath: 'హైడ్రా' భ‌యంతో మ‌హిళ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం.. క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ ఏమ‌న్నారంటే..!

Date : 28 September 2024 10:56 AM Views : 82

Studio18 News - తెలంగాణ / : హైద‌రాబాద్ న‌గ‌ర వ్యాప్తంగా హైడ్రా కూల్చివేత‌లు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, కూక‌ట్‌ప‌ల్లి ప‌రిధిలోని యాద‌వ బ‌స్తీకి చెందిన గుర్రంప‌ల్లి బుచ్చ‌మ్మ అనే మ‌హిళ హైడ్రా భ‌యంతో బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. శివ‌య్య‌, బుచ్చ‌మ్మ దంప‌తులు త‌మ ముగ్గురు కూతుళ్ల‌కు పెళ్లిళ్లు చేసి, క‌ట్నంగా త‌లో ఇల్లును రాసిచ్చారు. అయితే, చెరువుల ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో నిర్మించిన ఇళ్ల‌ను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ విష‌యం తెలిసి త‌మ బిడ్డ‌ల‌కు ఇచ్చిన ఇళ్లు కూల్చివేస్తార‌నే మ‌న‌స్తాపంతో త‌ల్లి బుచ్చ‌మ్మ ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు స‌మాచారం. స్పందించిన‌ 'హైడ్రా' క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్.. ఈ ఘ‌ట‌న‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ స్పందించారు. బుచ్చ‌మ్మ బ‌ల‌వ‌న్మ‌ర‌ణంపై కూక‌ట్‌ప‌ల్లి పోలీసుల‌తో మాట్లాడిన‌ట్లు తెలిపారు. హైడ్రా కూల్చివేత‌ల్లో భాగంగా త‌మ ఇళ్ల‌ను కూలుస్తార‌నే భ‌యంతో వారి కూతుర్లు ఆమెను ప్ర‌శ్నించారని, దాంతో బుచ్చ‌మ్మ మ‌న‌స్తాపానికి గురై ఆత్మ‌హ‌త్య చేసుకుందని, ఈ ఘ‌ట‌న‌తో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. హైడ్రా ఎవ‌రికీ నోటీసులు ఇవ్వ‌లేద‌న్న రంగ‌నాథ్‌.. శివ‌య్య దంప‌తులు త‌మ కూతుళ్ల‌కు రాసిచ్చిన ఇళ్లు కూక‌ట్‌ప‌ల్లి చెరువుకు స‌మీపంలోనే ఉన్న‌ప్ప‌టికీ ఎఫ్‌టీఎల్ ప‌రిధికి దూరంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఇక కూల్చివేత‌ల‌కు సంబంధించి మూసీ ప‌రిధిలో చేప‌ట్టిన ఏ స‌ర్వేలోనూ హైడ్రా భాగం కాలేదు. మూసీ న‌దిలో శ‌నివారం భారీగా ఇళ్ల‌ను హైడ్రా కూల్చివేయ‌బోతున్న‌ట్లు ఫేక్ న్యూస్ ప్ర‌చారం అవుతోంది. కొన్ని సోష‌ల్ మీడియా ఛాన‌ళ్లు ఒక ఎజెండాతో హైడ్రాపై న‌కిలీ వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నాయ‌ని రంగ‌నాథ్ మండిప‌డ్డారు. కూల్చివేత‌ల గురించి ప్ర‌జ‌లు అనవ‌స‌ర భ‌యాలు పెట్టుకోవ‌ద్ద‌ని సూచించారు. కూల్చివేత‌ల వ‌ల్ల పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు ఇబ్బందులు ప‌డ‌కుండా హైడ్రాకు ప్ర‌భుత్వం క‌చ్చిత‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింద‌ని తెలిపారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :