Monday, 08 December 2025 04:27:18 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

R Krishnaiah: నా చివరి కోరిక ఇదే: ఆర్. కృష్ణయ్య

Date : 30 October 2025 06:44 PM Views : 95

Studio18 News - TELANGANA / HYDERABAD : బీసీలకు రాజ్యాధికారం దక్కాలన్నదే తన చివరి ఆకాంక్ష అన్న ఆర్. కృష్ణయ్య బీసీ బంద్ సందర్భంగా 350 మందిని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపణ తెలంగాణ నుంచే బీసీ ఉద్యమం ప్రారంభమైందని వెల్లడి బీసీలకు రాజ్యాధికారం కల్పించడమే తన జీవితంలో చివరి కోరిక అని బీసీ సంఘాల నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదని, ఈ ఉద్యమం తెలంగాణ నుంచే ప్రారంభమైందని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల నిర్వహించిన 'బీసీ బంద్' సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 350 మందిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆర్. కృష్ణయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బీసీల హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న వారిని అరెస్టు చేయడం సరికాదని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా తన నాయకత్వంలో బీసీ జేఏసీని ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తుచేశారు. ఈ లక్ష్యం నెరవేరేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :