Monday, 08 December 2025 03:26:25 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

G Jagadish Reddy: హైడ్రా కూల్చివేతలతో రూ.1 లక్ష కోట్లకు పైగా వృథా అయ్యే అవకాశం: జగదీశ్ రెడ్డి

Date : 08 October 2024 03:08 PM Views : 401

Studio18 News - TELANGANA / : హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతల కారణంగా రూ.1 లక్ష కోట్లకు పైగా ప్రజాధనం వృథా అయ్యే అవకాశముందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీశ్ రెడ్డి అన్నారు. ఇప్పటికే రూ.1,000 కోట్ల వరకు ప్రజలు నష్టపోయారన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మూసీ సుందరీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక ఏమిటో చెప్పాలని నిలదీశారు. చెరువులు, మూసీ పరిస్థితిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. అసలు ప్రభుత్వం వద్ద మూసీపై డీపీఆర్ ఉందా? అని ప్రశ్నించారు. మూసీని, హుస్సేన్ సాగర్‌ను మురికికూపంలా మార్చిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. సుందరీకరణ అంటే ఇళ్లు, గుడిసెలు కూలగొట్టడం కాదన్నారు. మూసీలో కలిసే మురికి నీటిని, కాలుష్యాన్ని ఆపడం సుందరీకరణ అంటారని చురక అంటించారు. మూసీ సుందరీకరణ తమ హయాంలోనే ప్రారంభమైందని, రూ.16 వేల కోట్ల ఖర్చు అవుతుందని డీపీఆర్ ఇచ్చామని గుర్తు చేశారు. కాళేశ్వరం నీటిని కొండపోచమ్మ ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు తీసుకువచ్చి పరిశుభ్రమైన నీటిని అందించేందుకు తమ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నారు. ఇప్పటికీ మూసీ ప్రక్షాళన చేసేందుకు తాము సిద్ధమని, ఆ ప్రాజెక్టు మాకు ఇచ్చే దమ్ము మీకు ఉందా? అని సవాల్ చేశారు. ప్రభుత్వం వద్ద రుణమాఫీకే డబ్బులు లేవు, మూసీ సుందరీకరణకు ఎక్కడి నుంచి వస్తాయో చెప్పాలన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :