Studio18 News - తెలంగాణ / : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణకు వరద నష్టం సాయం పెంచాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో వరదలు సృష్టించిన విధ్వంసాన్ని రేవంత్ రెడ్డి వివరించారు. ఈ భేటీలో మూసీ ప్రక్షాళన అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. కేంద్రం చేపడుతున్న నమామి గంగే ప్రాజెక్టు తరహాలో మూసీ ప్రక్షాళన కార్యాచరణకు కూడా నిధులు అందించాలని రేవంత్ రెడ్డి హోంమంత్రి అమిత్ షాను కోరినట్టు తెలుస్తోంది. ఇవాళ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. దేశంలో నక్సలిజం రూపుమాపడంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరయ్యారు.
Admin
Studio18 News