Thursday, 26 March 2026 04:59:29 PM
# ఛలో అసెంబ్లీకి ముందే బీజేపీ నాయకుడి అరెస్ట్ # గ్యాస్ కొరతపై ఎల్‌బి నగర్‌లో భారస ఆందోళన # భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌లకు ఘన నివాళులు # Mallu Bhatti Vikramarka: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మల్లు భట్టి విక్రమార్క # గ్యాస్ ధరల పెరుగుదలతో క్యాటరింగ్ రంగం కష్టాల్లో # ధర్పల్లిలో రంజాన్ ఉపవాసాలు ఘనంగా ముగింపు # ముషీరాబాద్‌లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం.. యువతకు ప్రోత్సాహం # మందమర్రిలో ఈద్గా వద్ద మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రార్థనలు # రేకులపల్లిలో అర్ధరాత్రి దొంగతనం.. ప్రజల్లో భయాందోళన # జగిత్యాల కాంగ్రెస్‌లో కలకలం.. జీవన్ రెడ్డి అసంతృప్తి # ఆర్మూర్ చిన్న బాల్‌రాజ్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియామకం # బెల్లంపల్లిలో ఉగాది పచ్చడి పంపిణీ # ధర్పల్లిలో జడకొప్పులాట ప్రారంభం # లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం # కళ్ల దానం చేసి ఇద్దరికి వెలుగు నింపిన వర్షిత # తుల్లా దేవేందర్ గౌడ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు # పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా # మంచిర్యాల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్‌గా కొలుగూరి విజయ్ కుమార్ నియామకం # SC స్వయం ఉపాధి రుణాల గడువుపై నిరుద్యోగుల ఆగ్రహం # మందమర్రిలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

రేవంత్ రెడ్డికి దమ్ముంటే నాపై పోటీకి రావాలి: హరీశ్ రావు సవాల్

Date : 25 March 2026 05:22 PM Views : 7

Studio18 News - TELANGANA / HYDERABAD : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు విమర్శల వర్షం కురిపించారు. రేవంత్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని పగటి కలలు కంటున్నారని, ఆయన తల్లకిందులుగా తపస్సు చేసినా అది అసాధ్యమని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి ఎప్పుడు, ఎలా గోల్ కొట్టాలో బాగా తెలుసని, సమయం వచ్చినప్పుడు బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే వేరే వాళ్లను పంపడం కాకుండా, నేరుగా సిద్దిపేటలో తనపై పోటీకి రావాలని బహిరంగ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు రైతులను కూడా దారుణంగా మోసం చేసిందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైన రేవంత్ సర్కారుపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని ఆయన విశ్లేషించారు. ఇదే సమయంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అంశాలపై స్పందిస్తూ, తాము ఈ మార్పులను స్వాగతిస్తున్నామని తెలిపారు. పునర్విభజన వల్ల భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకే రాజకీయంగా మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, కుటుంబ నియంత్రణను పక్కాగా పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల కేటాయింపులో, నిధుల్లో అన్యాయం జరగడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారనే ప్రచారంపై హరీశ్ రావు ఆసక్తికరంగా స్పందించారు. ఆయన వస్తారా లేదా అనేది ఇప్పుడే చెప్పడం కంటే, వేచి చూస్తేనే బాగుంటుందని వ్యాఖ్యానించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :