Saturday, 14 March 2026 08:03:25 PM
# పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా # రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు # జిల్లాలో జనాభా గణన–2025 కోసం చర్యలు ప్రారంభం # పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం # పెద్దమ్మ తల్లి 27వ వార్షికోత్సవంలో ఘనంగా బోనాల ఉత్సవం # రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ # కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ అమ్మమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి # సికింద్రాపూర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు # కేంద్ర నిధులతో అక్కాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన # రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి : సీపీఐ జిల్లా కార్యదర్శి భూక్యా రమేష్ # ధర్పల్లి మండలంలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం # రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి # జిల్లాకు వచ్చిన అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్‌ను కలిసిన కలెక్టర్

రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి : సీపీఐ జిల్లా కార్యదర్శి భూక్యా రమేష్

Date : 13 March 2026 04:08 PM Views : 5

Studio18 News - TELANGANA / NIRMAL : నిర్మల్ జిల్లాలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి భూక్యా రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా లేక రైతులు అప్పుల పాలై వ్యాపారస్తుల వద్ద అత్యధిక వడ్డీతో డబ్బులు తీసుకొని సాగు చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామాల్లో చాలా మంది రైతులు పంటకు సరైన సమయంలో ఎరువులు అందకపోవడంతో దిగుబడులు తగ్గిపోతున్నాయని, రైతు భరోసా కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతులు అప్పుల భారంతో తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. అప్పుల బాధతో కొంతమంది రైతులు గడ్డి మందు తాగి ఆత్మహత్యలకు పాల్పడుతూ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ప్రతి సీజన్‌కు సరైన సమయంలో రైతు భరోసా నిధులు అందేవని, ప్రస్తుతం అందకపోవడంతో గ్రామాల నుంచి వలసలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. రైతులకు చిన్నచూపు చూడడం సరైన విధానం కాదని, వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సీపీఐ పార్టీ రైతుల పక్షాన నిలబడి నిరసనలు, ధర్నాలు, దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు ఎస్‌.ఎన్‌.రెడ్డి, నారాయణ, శ్రీనివాస్, రాజేశ్వర్, ముత్యం, రైతు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :