Studio18 News - TELANGANA / : ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళను కానిస్టేబుల్ సమయస్ఫూర్తి కాపాడిన ఘటన మహబూబాబాద్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాధితురాలి కుటుంబ సభ్యులు, పోలీస్ కానిస్టేబుల్ చెప్పిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ కు చెందిన ఓ మహిళ కుటుంబ కలహాల కారణంగా విసిగిపోయి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుంది. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్ రాంబాబు సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. ఉరి బిగుసుకుపోవడంతో స్పృహ తప్పిన మహిళకు సీపీఆర్ చేశాడు. కుటుంబ సభ్యులు సమాచారం అందించడంతో అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. ఈ లోగా రాంబాబు చేసిన సీపీఆర్ తో మహిళ తనకు తానుగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించింది. అంబులెన్స్ సిబ్బంది ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ రాంబాబుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Also Read : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఫిబ్రవరి నెల కోటా విడుదల
Admin
Studio18 News