Studio18 News - తెలంగాణ / : పాఠశాలల పరిశుభ్రత కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 'అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ'కి స్కూళ్ల పరిశుభ్రత బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం గ్రాంట్స్ మంజూరు చేసింది. పాఠశాలల నిధులకు అదనంగా ఈ గ్రాంట్‌ను కేటాయించినట్లు తెలిపింది. తెలంగాణలోని పాఠశాలల్లో పరిశుభ్రత కొరవడిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 30 లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలకు రూ.3 వేలు, 31 నుంచి 100 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు రూ.6 వేలు, 101 నుంచి 200 మంది ఉంటే రూ.8 వేలు, 251 నుంచి 500 లోపు విద్యార్థులు ఉంటే రూ.12 వేలు, 501 నుంచి 750 మంది వరకు విద్యార్థులు ఉంటే రూ.15 వేలు, 750 కంటే ఎక్కువ మంది ఉంటే రూ.20 వేల చొప్పున గ్రాంట్ ఇవ్వనుంది. మొత్తం 10 నెలల కాలానికి ఒకేసారి నిధులు విడుదల చేస్తారు.
Admin
Studio18 News