Studio18 News - తెలంగాణ / : రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కొన్ని రోజుల క్రితం ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్‌ను కొందరు రౌడీలు ఫాంహౌస్‌లో బంధించి హింసించిన విషయం తెలిసిందే. శంషాబాద్‌లోని ధర్మగిరిగుట్ట ఆలయానికి సమీపంలో ఆ ఫాంహౌస్ ఉంది. ఆ ఫాంహౌస్‌కు అనుమతులు లేవని మునిసిపల్ సిబ్బంది గుర్తించారు. ఫాంహౌస్ యాజమానికి నోటీసు జారీ చేశారు. ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని మునిసిపల్ అధికారులకు పోలీసులు ఫిర్యాదు చేయడంతో దానిపై చర్యలు తీసుకుంటున్నారు. జేసీబీలతో ఫాంహౌస్‌ను కూల్చివేశారు. భారీ పోలీసులు బందోబస్తు నడుమ కూల్చివేతలు జరిగాయి. భూ కబ్జాలకు పాల్పడితే సహించేది లేదని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. రౌడీలు ఎవరినైనా ఇబ్బంది పెడితే నేరుగా పోలీసులను సంప్రదించాలని అన్నారు.
Admin
Studio18 News