Studio18 News - TELANGANA / KARIMNAGAR : కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండలంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పలు గ్రామాలను పర్యటించారు. ఈ పర్యటనలో గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, కొప్పుల ఈశ్వర్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు. గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో కొండన్నపల్లి వరద కాలువను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి కాలువ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ముందు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని ఆయన విమర్శించారు. అదే కాళేశ్వరం మోటార్ల ద్వారా ప్రాజెక్టులు, వరద కాలువలకు నీరు అందుతున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తేనే రైతులకు నీరు అందించే పరిస్థితి వచ్చిందని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల ఎకరాల సాగుకు జీవనాడిగా ఉందని హరీష్ రావు పేర్కొన్నారు. రెండున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం నిర్మించిన చెక్ డ్యాంలు, ప్రాజెక్టులు ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కుంగిపోయిన ప్రాజెక్ట్ భాగాలను వెంటనే మరమ్మతులు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. గంగాధర చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి హరీష్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. గోపుల్ రావ్ పల్లెలో అడుగంటిన పంట పొలాలు, బావులను పరిశీలించిన అనంతరం రైతుల బాధలను తెలుసుకున్నారు. తదనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు.
Admin
Studio18 News