Saturday, 14 March 2026 09:49:04 PM
# పకడ్బందీగా పదో తరగతి పరీక్షల నిర్వహణ # మండుటెండలో కొనసాగుతున్న బండి సంజయ్ పాదయాత్ర… తేనెటీగల కలకలం # పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప ఉద్రిక్తత # మందమర్రి పోలీస్ స్టేషన్‌లో పరిశుభ్రత కార్యక్రమం # జిల్లా జైల్లో ఖైదీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణ # జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు: కలెక్టర్ గరిమ అగ్రవాల్ # రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు – 34 కేంద్రాల్లో ఏర్పాట్లు # జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా # రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు # జిల్లాలో జనాభా గణన–2025 కోసం చర్యలు ప్రారంభం # పీఎం కిసాన్ పథకం నిధుల విడుదల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం # పెద్దమ్మ తల్లి 27వ వార్షికోత్సవంలో ఘనంగా బోనాల ఉత్సవం # రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ # కౌన్సిలర్ గుర్రం శ్రీనివాస్ అమ్మమ్మ దశదిన కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి # సికింద్రాపూర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు # కేంద్ర నిధులతో అక్కాపూర్ గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన # రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి : సీపీఐ జిల్లా కార్యదర్శి భూక్యా రమేష్ # ధర్పల్లి మండలంలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం # రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదు : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి # జిల్లాకు వచ్చిన అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్‌ను కలిసిన కలెక్టర్

సత్య హరిచంద్ర స్మశాన వాటికలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

Date : 11 March 2026 02:58 PM Views : 66

Studio18 News - TELANGANA / JAGTIAL : జగిత్యాల పట్టణం గొల్లపల్లి రోడ్‌లో గల సత్య హరిచంద్ర స్మశాన వాటికలో రోటరీ మరియు రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమం, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా రోటరీ మరియు రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. హైదరాబాద్ మహాప్రస్థానం తరహాలో అత్యున్నత సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పుట్టిన వారు ఎప్పటికైనా చనిపోవడం సహజమని, చనిపోయిన తర్వాత వారి ఆత్మ ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. పట్టణ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని పేర్కొంటూ రోటరీ, రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో స్మశాన వాటిక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు అరవ లక్ష్మీ, పద్మ సింగరావు, రాగుల ప్రదీప్, పిట్ట ధర్మరాజు, బొలుసాని శ్రీనివాస్, రోటరీ క్లబ్ అధ్యక్షులు చారి, రెడ్ క్రాస్ సభ్యులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్, టీవీ సూర్యం, బోడ్ల జగదీష్, వేణుగోపాల్, నాయకులు సుధాకర్ రావు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, కౌన్సిలర్లు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది, ఎన్సీసీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2026. All right Reserved.



Developed By :