Studio18 News - తెలంగాణ / : సీఎం రేవంత్ రెడ్డి తప్పుల చిట్టాను రాస్తున్నానని, వాటిని సమయం వచ్చినప్పుడు బయటపెడతానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తాము తెలంగాణలో ఎనిమిది లోక్‌సభ స్థానాలు గెలిచామని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఓటు షేర్ తేడా కేవలం 4 శాతం మాత్రమే ఉందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కృషి చేసినట్లే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అంతే కసిగా పనిచేయాలని తమ నేతలు, కార్యకర్తలకు ఈటల రాజేందర్ చెప్పారు. ప్రజలతో కేసీఆర్ ఛీ అనిపించుకోవడానికి ఆరేళ్లు పట్టిందని, కాంగ్రెస్ సర్కారు ప్రజలతో ఛీ కొట్టించుకోవడానికి కేవలం 9 నెలలు కూడా పట్టలేదని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారని చెప్పారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయినట్లు మాట్లాడుతున్నారని ఈటల రాజేందర్ అన్నారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్న వారికి ఎన్ కన్వెన్షన్ మాత్రమే కనిపిస్తోందని, హస్మత్ చెరువు కింద 120 మంది పేదలకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఫిరంగి నాల ముసుకుపోయిందని, పేదల ఇళ్లను కూల్చేయడం కాంగ్రెస్ తరం కాదని, పేదల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
Admin
Studio18 News