Monday, 08 December 2025 03:47:15 AM
# నీలాద్రి అడవి జింకలను వేటాడి చంపిన నలుగురు నిందితులు అరెస్ట్ # అయ్యప్పమాల వేసుకున్నాడని స్టూడెంట్‎ను కాలేజీ యాజమాన్యం కాలేజీ లోపలికి రానివ్వలేదు. # అంబర్పేట్ లో అంబేద్కర్ వర్ధంతి నిర్వహించిన కాంగ్రెస్ నేతలు # లీకేజీల బెడద.. మరమ్మతులపై నిర్లక్ష్యం..? # కోటలో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘన నివాళులు # రైల్వే డిఆర్‎ఎం లలిత్ బొహరాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భేటీ # అత్యంత ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం # రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం... ఆర్టీసీ డ్రైవర్ పై దాడి # వేములవాడలో భారీ అగ్ని ప్రమాదం..70 క్వింటాళ్ల పత్తి దగ్ధం # మంత్రి దామోదర రాజనర్సింహ జన్మదిన వేడుకలు # తీన్మార్ మల్లన్న హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు # మంజీరో హై స్కూల్లో అండర్ 16 కోకో టోర్నమెంట్.. # ఏ.ఎస్.రావు నగర్‎లో జోయాలుక్కాస్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ ప్రారంభం # దాచేపల్లిలో కాపు కమ్యూనిటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే # గుంటూరు జిల్లాలో పర్యటించిన నగర కమిషనర్ పులి శ్రీనివాసులు # ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ # నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జక్కుల గంగరాజు.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసేందుకు బయలుదేరిన దేవరుప్పుల గ్రామ స్వతంత్ర అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్.. # భారీ ర్యాలీతో నామినేషన్ వేసిన దేవరుప్పుల గ్రామ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏల సుందర్ # మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు రుణమాఫీపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వెల్లడి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్

తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. బీ

Date : 17 March 2025 03:57 PM Views : 313

Studio18 News - TELANGANA / : తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ డేటాను నమ్ముకుంటే, సీఎం రేవంత్ మాత్రం డర్టీ ట్రిక్స్ నమ్ముకున్నారని ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయకున్నా జగదీశ్ రెడ్డిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడం దారుణమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషపై హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం బూతులకు జీఎస్టీ వేస్తే రాష్ట్ర ఖజానా మొత్తం సరిపోదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చావును కోరుకున్న రేవంత్, ఆ తర్వాత మాట మార్చి బీఆర్ఎస్ ను అన్నానని చెప్పడం సిగ్గుచేటన్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డిని కేసీఆర్ ఎప్పుడూ గౌరవంగా సంబోధించేవారని గుర్తు చేశారు. రుణమాఫీపై రేవంత్ ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. సంపూర్ణ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. రాష్ట్ర భవిష్యత్తు పట్ల కేసీఆర్ కు, బీఆర్ఎస్ పార్టీకి బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని జీఎస్డీపీలో నంబర్ వన్ గా, తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో నిలిపామని గుర్తు చేశారు. విద్యుత్ వినియోగంలో, వరి ధాన్యం ఉత్పత్తిలోనూ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపామని చెప్పారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి సైతం ప్రశంసించిందని గుర్తు చేశారు. రాష్ట్రం పట్ల ప్రస్తుత సర్కారుకు బాధ్యత లేని కారణంగానే ప్రాజెక్టులు అగ్గిపెట్టెల్లా కూలిపోతున్నాయని, పంటలు ఎండిపోతున్నాయని హరీశ్ రావు దుయ్యబట్టారు. రేవంత్ నిర్లక్ష్యం వల్ల రైతులు, చేనేత కార్మికులు, ఆటో కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పదవి కోసం కేటీఆర్ తో తాను పోటీ పడలేదని, తామిద్దరం ఉద్యమకారులమని, కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశామని హరీశ్ రావు స్పష్టం చేశారు. కేసీఆర్ ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలమని అన్నారు. రాష్ట్రానికి పట్టిన శని లాంటి రేవంత్ రెడ్డి పీడను వదిలించడానికి తాము పోటీ పడతామని హరీశ్ రావు తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం, మేలు చేయడం కోసం, ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసే వరకు ఆయన వెంటపడతామని అన్నారు. ముక్కు పిండి మరీ మహాలక్ష్మి కింద రూ.2500 ఇప్పించడం కోసం, రైతు రుణమాఫీ పూర్తయ్యే వరకు, రైతులకు రూ.15 వేల రైతు బంధు డబ్బులు పడే వరకు రేవంత్ రెడ్డిని వెంబడిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి ఒక్కొక్కరినీ తొక్కుకుంటూ, సీనియర్లపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి, రూ.50 కోట్లకు పీసీసీ పదవి కొనుక్కున్నారని కొందరు చెప్పారని హరీశ్ రావు ఆరోపించారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2025. All right Reserved.



Developed By :