Studio18 News - TELANGANA / : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. హరీశ్ రావు ఏ హోదాతో ప్రశ్నలు అడుగుతున్నారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఆరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలయింది. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ... అసలు హరీశ్ రావు ఎవరని ప్రశ్నించారు. డిప్యూటీ లీడరా? ఎమ్మెల్యేనా? ఏ హోదాతో మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎక్కడున్నారని అడిగారు. నల్గొండ గురించి, తన గురించి మాట్లాడే హక్కు హరీశ్ కు లేదని చెప్పారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీని పట్టించుకోలేదని విమర్శించారు. నిన్న కూడా కోమటిరెడ్డి, హరీశ్ మధ్య మాటల యుద్ధం కొనసాగిన సంగతి తెలిసిందే.
Also Read : డాలర్‌తో పోలిస్తే దారుణంగా పతనమైన రూపాయి విలువ
Admin
Studio18 News