Tuesday, 03 December 2024 04:15:12 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

కాంగ్రెస్‌ను ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు: జగదీశ్ రెడ్డి

ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు రేవంత్‌ను చూసి భయపడే పరిస్థితి ఉందన్న మాజీ మంత్రి రేవంత్ రెడ్డి చెడ్డపేరు తెచ్చుకొని చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నారని ఎద్

Date : 12 November 2024 05:19 PM Views : 54

Studio18 News - తెలంగాణ / : కాంగ్రెస్ పార్టీని ఉపయోగించుకొని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసి ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... వికారాబాద్‌లో నిన్న అధికారులపై జరిగిన దాడితో రేవంత్ ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందన్నారు. కేసీఆర్‌ను నోటికి వచ్చినట్లు బూతులు తిట్టి సీఎం టైంపాస్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు కేసీఆర్‌ను మరిచిపోయారని చెబుతూనే... పదేపదే కేసీఆర్‌ను తలుచుకుంటూ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. చెడ్డపేరు తెచ్చుకొని చరిత్రలో నిలిచిపోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. నిన్నటి దాడి ఘటన వెనుక బీఆర్ఎస్ కుట్ర అని చెప్పడం విడ్డూరమని, మేధావులు వెళ్లి అసలు విషయం తెలుసుకోవాలన్నారు. ఢిల్లీకి 25 సార్లు వెళ్లిన రేవంత్ రెడ్డి ఎవరి కాళ్లు మొక్కారో చెప్పాలని చురక అంటించారు. కేటీఆర్ ఎందుకు ఢిల్లీ వెళ్లారో మీ ఇంటెలిజెన్స్ ద్వారా కనుక్కోవచ్చని సూచించారు. కాంగ్రెస్, బీజేపీల బండారం బయటపెట్టేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని పేర్కొన్నారు. ఏ సమయంలో బయటకు రావాలో కేసీఆర్‌కు తెలుసని... ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కేసీఆర్ ఓ వ్యక్తి కాదని.. శక్తి అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు రివ్యూ చేస్తున్నట్లు నటిస్తూనే... మరోవైపు ప్లాన్ ప్రకారం మిల్లర్లను, దళారీలను రైతుల మీదకు వదిలారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. దీని వెనుక వందల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దళారులు, మిల్లర్లతో మంత్రులు కుమ్మక్కు అయ్యారన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం రైతులతో ఆడుకుంటోందన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేశామన్నారు. రైతుల వద్ద ధాన్యం కొనకుండా అధికారులను నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి బెదిరిస్తున్నారని ఆరోపించారు. దళారులతో కుమ్మక్కు కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. రైతులు దోపిడీకి గురవుతున్నారని... దీనికి వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు గింజ ధాన్యం కొనుగోలు చేయలేదని... రైతులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పేందుకు అధికారులు భయపడుతున్నారన్నారు.

Also Read : అమ్మకాల ఎఫెక్ట్... నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :