Tuesday, 03 December 2024 05:41:13 AM
# హైదరాబాద్‌లో మరో రియల్ స్కామ్.. # ఈజీగా శబరిమలలో దర్శనం .. ఇలా చేయండి చాలు .. # గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి # #Rajannasircilla : రాజన్న సేవలో మంత్రి దంపతులు # మణిపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ # పోలీసులకు ఆ కుటుంబాల ఉసురు తగులుతుంది : పేర్ని నాని # సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత # భీమవరంలో లేడీ అఘోరీ # పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. # ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు: సీఎం చంద్రబాబు # తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ # తిరిగి మనం అధికారంలోకి వస్తాం : వైఎస్‌ జగన్‌ # రూంకి రాకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామంటూ వేధింపులు # పెట్రోల్ పంపు వద్ద మంటల్లో కాలి బూడిదైపోయిన కారు # ప్రియురాలిని విదేశాలకు పంపించాడని తండ్రిపై కాల్పులు # ఆరాంఘర్‌లో ఘోర అగ్నిప్రమాదం # బాసర IIITలో ఆర్మూర్ విద్యార్థిని సూసైడ్ # మానవత్వాన్ని చాటుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ # జాగ్రత్త.. పేర్లు రాసుకుంటున్నాం..!- పోలీసు అధికారులకు హరీశ్ రావు సీరియస్ వార్నింగ్ # విశాఖ హనీ ట్రాప్ కేసు.. వెలుగులోకి జాయ్ జెమీమా మోసాలు..

Madhu Yaskhi: మూసీ పరీవాహక ప్రాంతంలో ఎవరూ భయపడవద్దు... అండగా ఉంటాను: మధుయాష్కీ

Date : 08 October 2024 06:31 PM Views : 22

Studio18 News - తెలంగాణ / : మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు తాను అండగా ఉంటానని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ హామీ ఇచ్చారు. చైతన్యపురి డివిజన్‌ ఫణిగిరి కాలనీలోని సాయిబాబా గుడి వద్ద మూసీ పరీవాహక ప్రాంతవాసులతో ఆయన సమావేశమయ్యారు. హైడ్రా కూల్చివేతలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్లు కూలిస్తే తాము ఎక్కడ ఉండాలని ఆవేదన చెందారు. ఆయనకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యాష్కీ మాట్లాడుతూ... ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణలో భాగంగా నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా ఆలోచిస్తోందన్నారు. హైదరాబాద్ లోపల మూసీ వేరని, చైతన్యపురి, కొత్తపేట, నాగోల్ లాంటి శివారు ప్రాంతాల్లో వేరు అన్నారు. హైదరాబాద్‌లో మూసీ తక్కువ వెడల్పుతో ఉంటుందని, చైతన్యపురి, కొత్తపేట, నాగోల్‌ ప్రాంతాలలో చాలా విశాలంగా ఉంటుందన్నారు. పరీవాహక ప్రాంతంలో ఇళ్లులేని వైపు ఎక్కువగా భూసేకరణ చేసే విధంగా ప్రభుత్వంతో మాట్లాడుతానని, తద్వారా ఇళ్లు కోల్పోకుండా ప్రయత్నం చేస్తానన్నారు. ప్రజల అనుమానాలు, భయాలను తీర్చడానికి స్వయంగా తానే సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క వద్దకు నిర్వాసితులను తీసుకెళ్లి మాట్లాడుతానన్నారు. ప్రజలతో చర్చించకుండా ఎవరి ఇళ్లను కూల్చేది లేదన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు చెరువులు, కుంటలను మింగేశారని ఆరోపించారు. చెరువులను ఆక్రమించిన వారిపై విచారణ జరిపించడం ఖాయమన్నారు.

Studio 18 News

Admin

Studio18 News

మరిన్ని వార్తలు

Copyright © Studio18 News 2024. All right Reserved.



Developed By :