Studio18 News - తెలంగాణ / : Mobile Phones Recovery : రైల్వే పోలీసుల పనితీరు పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రైన్ జర్నీలో తాము పొగొట్టుకున్న సెల్ ఫోన్లను రైల్వే పోలీసులు రికవరీ చేసి ప్రయాణికులకు తిరిగి ఇచ్చారు. సుమారుగా 713 సెల్ ఫోన్స్ రికవరీ చేశారు రైల్వే పోలీసులు. ఈ వివరాలను రైల్వే ఎస్పీ చందన దీప్తి వెల్లడించారు. ”Grp పోలీస్ స్టేషన్ నుండి 713 మొబైల్స్ రికవరీ చేసి ఓనర్స్ కి ఇచ్చాము. 2 నెలల వ్యవధిలో చోరీకి గురైన 210 ఫోన్లు రికవరీ చేశాం. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు రాష్ట్రాలలో చోరీ, స్నాచింగ్, పోగొట్టుకున్న మొబైల్స్ రికవరీ చేశాం. అప్డేట్ ఫీచర్స్ తో వచ్చిన న్యూ మొబైల్స్ తో సహా పెద్ద కంపెనీల మొబైళ్లను చోరీ చేస్తున్నారు. మొబైల్ పోయిన వెంటనే మీసేవలో అప్లయ్ చేసుకోవాలి. CEIR పోర్టల్ లో ఫిర్యాదు చెయ్యాలి. 25 మంది తమ మొబైల్స్ పోయాయని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. నిందితులను త్వరలో పట్టుకుంటాము. IMEI నంబర్స్ ద్వారా మొబైల్స్ ను రికవరీ చేశాం. రైలు ప్రయాణాలు చేసే వారు మీ వెంట తీసుకుని వెళ్ళే బ్యాగులు, సెల్ ఫోన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటు పనికిరాదు”.- చందన దీప్తి, రైల్వే ఎస్పీ.
Admin
Studio18 News